
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యుద్ద విమానం మధ్యప్రదేశ్‌లో కూలిపోయింది. భింద్ జిల్లాకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంకాబాద్‌లోని ఖాళీ మైదానంలో విమానం క్రాష్ అయినట్లు భింద్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారని ఆయన చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.