మూడు జిల్లాల్లో ఆర్మీకి స్పెషల్ పవర్స్

మూడు జిల్లాల్లో ఆర్మీకి స్పెషల్ పవర్స్

ఈశాన్య రాష్ట్రాల్లో అనిశ్చితి కొనసాగుతున్న జిల్లాల్లో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కొనసాగిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీచేసింది.  అరుణాచల్ ప్రదేశ్ లోని 3 జిల్లాలు… అస్సాం సరిహద్దు  నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. ఈ ఏరియాల్లో ఆర్మీ స్పెషల్ పవర్స్ ను మరో ఆరు జిల్లాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. Armed Forces (Special Powers) Act(AFSPA) 1958 చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర హోంశాఖ.

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తిరప్, చాంగ్ లాంగ్, లాంగ్ డింగ్ జిల్లాలు… అస్సాం సరిహద్దులోని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే సైన్యానికి అదనపు పవర్స్ ఉన్నాయి. నిషేధిత తీవ్రవాద సంస్థలు.. సరిహద్దు భధ్రతను దెబ్బతీస్తున్న పరిస్థితుల్లో శత్రువుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు.. భారత భద్రతా బలగాలు అక్కడ మోహరించాయి.

అరుణాచల్ ప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంశాఖ.. ఇవాళ ఈ నిర్ణయం తీసుకుంది.