
ఖమ్మం నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో పని కోసం ఉన్న మైనర్ బాలిక నర్సమ్మ (13) పై హత్యాచారయత్నం చేశాడు ఇంటి ఓనర్. ముస్తఫానగర్ కు చెందిన రాములమ్మ ఇంట్లో పని కోసం పల్లేగుడెం గ్రామానికి చెందిన నర్సమ్మ అనే బాలికను తెచ్చుకుంది. కరోనా వల్ల కుటుంబ పోషణ బారమై 4 వ తరగతి చదువుతున్న బాలిక.. సుబ్బారావు,రాములమ్మ ఇంట్లో పనికి వెళ్ళింది. వారి కుమారుడు మారయ్యూ ఆ బాలికపై కన్నేశాడు. ఎవ్వరూలేని సమయంలో బాలికపై అగాయిత్నానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిగటించే సరికి పెట్రోలు పోసి చంపే ప్రయత్నం చేశాడు. బాలిక అరుపులతో స్థానికులు విషయం తెలిసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
వెంటనే స్థానికుల సాయంతో బాలికను ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు తల్లిదండ్రులు. విషయం సీరియస్ అవుతుందని గ్రహించిన ఇంటి ఓనర్ కాంప్రమైజ్ అవుతానని చెప్పాడు. వైద్యం డబ్బులు కడుతాం అని చెప్పి, పోలీస్ కేసు పెట్టవద్దని తల్లి దండ్రులను బెదిరించాడని తెలిపారు బాలిక తల్లిదండ్రులు. బాలిక ఆరోగ్యం విషమించడంతో..ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.