ట్రిపుల్ ఐటీలో హోమ్​సిక్​ హాలిడేస్​

ట్రిపుల్ ఐటీలో హోమ్​సిక్​ హాలిడేస్​
  • వరుస ఘటనలతో మేనేజ్​మెంట్​ నిర్ణయం
  • లెక్చరర్స్ తో వీసీ, కలెక్టర్అత్యవసర సమావేశం 
  • ప్రతి శనివారం ఆర్ యూ ఓకే’ కార్యక్రమం 

నిర్మల్, వెలుగు:  బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ కు ఐదు రోజుల పాటు హోమ్​ సిక్ ​హాలీడేస్ ​ప్రకటించారు. ఇటీవల జాదవ్ బబ్లూ అనే పీయూసీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని మొదట్లో సీరియస్​గా తీసుకోని ట్రిపుల్​ ఐటీ యాజమాన్యం.. ‘వెలుగు’లో 'బాసర ట్రిపుల్ ఐటీలో ఏం మారలే' అన్న కథనం రావడంతో  స్పందించింది. శుక్రవారం  ట్రిపుల్ ఐటీ వైస్ చాన్స్​లర్ వెంకటరమణ, నిర్మల్ ​జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి క్యాంపస్​లో లెక్చరర్స్, పేరెంట్స్ తో ఎమర్జెన్సీ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా హాలీడేస్​ ప్రకటించడంతో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే  హోమ్ సిక్ హాలిడేస్ ఇవ్వడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.  

ఒత్తిడి తగ్గించే దిశగా చర్యలు

స్టూడెంట్స్​ ఒత్తిడికి గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా మీటింగ్ లో చర్చించారు.  ఒక్కో లెక్చరర్ వంద నుంచి 150 మంది స్టూడెంట్స్​కు మెంటర్​గా వ్యవహరించాలని వీసీ వెంకటరమణ, కలెక్టర్ ​వరుణ్​రెడ్డి సూచించారు. కౌన్సిలర్ల సంఖ్య పెంచాలని, గర్ల్ స్టూడెంట్స్ కోసం మహిళా కేర్ టేకర్స్ ను నియమించాలని  నిర్ణయించారు. రోజూ ఉదయం యోగా ​,  15 రోజులకోసారి మోటివేషన్ క్లాస్, వారానికొకసారి ‘ఆర్​యూ ఒకే’ ప్రోగ్రామ్​ నిర్వహించాలని నిర్ణయించారు.  

ప్రతి శనివారం రాత్రి మోటివేషనల్ మూవీ  వేయాలని, స్పోర్ట్స్ ​యాక్టివిటీ పెంచాలని సూచించారు.  స్టూడెంట్స్ సమస్యలు, ప్రోగ్రెస్ పై  ప్రతినెలా పేరెంట్స్ తో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, వసతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించించేందుకు లెక్చరర్లతో కమిటీని ఏర్పాటు చేయాలని, మెస్​లో ఫుడ్​ క్వాలిటీని లెక్చరర్లు చెక్ ​చేయాలని  సూచించారు.  సైన్స్ బ్లాక్, కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణాలను వెంటనే పూర్తి చేస్తామని వీసీ  తెలిపారు.