Home Tips : గాజు సామాన్లు పగిలితే ఎలా తీయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Home Tips : గాజు సామాన్లు పగిలితే ఎలా తీయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

గాజు సామాన్లు ప్రతి ఇంట్లో కామన్. వాడకపోయినా అలంకరణ కోసమైనా కొందరు ఇంట్లో పెట్టుకుంటారు. అయితే వాటిని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో చిచ్చర పిడుగులు ఆడుకోవడానికి తీసి పగలగొడుతుంటారు. లేదంటే వాటిని తుడవడానికి తీసినప్పుడు చేజారి పడిపోవ చ్చు. అందుకే వాటిని పిల్లలకు అందకుండా పెట్టాలి. ఒకవేళ అవి పగిలిపోతే ముక్కలను వెంటనే తీసేయాలి.

లేదంటే పెద్దలకే కాదు పిల్లలకు ప్రమాదమే. గాజు ముక్కలు తీసే ముందు చేతులకు క్లౌజులు వే సుకోవాలి. లేదంటే చిన్న చిన్న గాజు ముక్కలు చేతులకు గుచ్చుకుపోయే ప్రమాదం ఉంటుంది. పగిలిన ముక్కల ను నిదానంగా తీసేయాలి. పేపర్తో నెమ్మదిగా ముక్క లను ఒకచోటుకు చేర్చాలి. తర్వాత వేరే పేపర్ సాయంతో ముక్కలను పేపర్లో చుట్టి దూరంగా పడేయాలి. తర్వాత ఆ ప్రాంతాన్ని వాక్యూమ్ క్లీన ర్తో మళ్లీ శుభ్రం చేయాలి.