ఆన్‌‌లైన్‌‌లో ఇళ్లు కూడా కొనుక్కోవచ్చు

ఆన్‌‌లైన్‌‌లో ఇళ్లు కూడా కొనుక్కోవచ్చు

హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌.కామ్‌ పోర్టల్‌‌ను లాంచ్ చేసిన అర్బన్‌‌ అఫైర్స్‌‌ సెక్రటరీ

న్యూఢిల్లీ: దేశంలో పూర్తయిన రెసిడెన్షియల్​ యూనిట్స్‌‌ మార్కెటింగ్‌ కోసం నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ (నారెడ్కో) ఈ–కామర్స్‌‌ ప్లాట్‌‌ఫార్మ్‌‌ను మంగళవారం హౌసింగ్‌ , అర్బన్‌‌ అఫైర్స్‌‌ సెక్రటరీ దుర్గా శంకర్‌ మిశ్రా లాంచ్ చేశారు. ఈ పోర్టల్‌ ఇండియన్‌‌ రియల్‌ ఎస్టేట్‌‌లో అమెజాన్‌‌ సైట్‌‌లా మారుతుందని ఆశించారు. నారెడ్కో www.housingforall.com పోర్టల్‌ పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. దీనితో కస్టమర్ల సమస్యలను పరిష్కరించడానికి వీలుంటుందన్నారు. ఇలాంటి పోర్టల్‌‌నే రియల్టర్‌ బాడీ క్రెడాయ్‌ కూడా లాంచ్​ చేసిందన్నారు. కేంద్ర హౌసింగ్‌ , అర్బన్‌‌ అఫైర్స్‌‌ మినిస్ట్రీ కింద పనిచేసే నారెడ్కో, రెరా రిజిస్ట్రేషన్‌‌ ఉన్న రెడీ టూ మూవ్‌ హౌసింగ్‌ ప్రాజెక్టులను ఈ పోర్టల్‌‌లో నమోదు చేసుకోవడానికి అనుమతిస్తుంది. ప్రాజెక్టులను పోర్టల్‌‌లో రిజిస్టర్‌ చేసుకోవడానికి రియల్‌ ఎస్టేట్ డెవలపర్ల కోసం(జనవరి 14–ఫిబ్రవరి 13, 2020) ఒక నెల పాటు అందుబాటులో ఉంచుతుంది. ఇళ్లను కోనుగోలు చేయాలనుకునే వారి కోసం ఈ పోర్టల్‌ ఫిబ్రవరి 14 నుంచి అందుబాటులోకి వస్తుంది. హోం బయ్యర్లు 45 రోజుల సేల్‌ పీరియడ్‌‌ను ఆక్సెస్​‌‌ చేయడానికి వీలుంటుంది. ఇందులో మొదటి 15 రోజులలో ఆఫర్లను చూసుకోవడానికి, నచ్చిన ఇళ్లను షార్ట్‌ లిస్ట్‌ చేసుకోవడానికి వీలుంటుంది. ఇళ్లను తర్వాతి 30 రోజులలో కొనుగోలు చేసుకోవచ్చు. మొత్తంగా 1,000కి పైగా ప్రాజెక్టులు ఈ పోర్టల్‌‌లో లిస్ట్‌ అవుతాయని నారెడ్కో అంచనా వేస్తోంది. కొనుగోలుదారులు సైట్‌ ద్వారా డైరక్ట్​గా ఇళ్లను కొనుగోలు చేయొచ్చు. కేవలం రూ.25,000 నగదుతో అడ్వాన్స్‌‌గా బుక్‌ చేసుకోవచ్చు.