యువతతోనే సిద్దాంత రాజకీయాలు :వెంకయ్య నాయుడు

యువతతోనే సిద్దాంత రాజకీయాలు :వెంకయ్య నాయుడు

నీతి, నిజాయితీ విలువలతో కూడిన రాజకీయాలు యువతతోనే సాధ్యమవుతాయని.. దేశం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలంటే యువత పాలు పంచుకోవాలని మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన సిటిజన్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పార్లమెంట్ సిస్టమ్ లో యువత ముందుండాలన్నారు. దేశ చరిత్ర, త్యాగాలు, పోరాటాలు, సవాళ్లను యువత తప్పనిసరిగా అధ్యయనం చేయాలన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే అధ్యయనం చాలా అవసరమన్నారు. 

ఇటీవల రాజకీయాల్లో వలసలు ఎక్కువయ్యాయి. ఓ పార్టీ వదిలి ఇంకో పార్టీకి వెళ్లడం కాదు.. నమ్మిన సిద్ధాంతం కోసం ఒకే పార్టీలో ఉండి పోరాడాలన్నారు వెంకయ్య నాయుడు. యువత రాజకీయాల్లోకి రావాలి.. నీతి, నిజాయితి, విలువలతో కూడిన రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యువతతోనే నిజాయితీ, ఆదర్శవంతమైన, సిద్ధాంత పరమైన రాజకీయాలు సాధ్యమవుతాయన్నారు.  రాజకీయాల్లోకి రావాలంటే బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదు.. రాజకీయాల్లో రాణించాలంటే అధ్యయనం అవసరమని అన్నారు వెంకయ్య నాయుడు.

ప్రతి ఒక్కరికి భాషా పరిజ్ఞానం అవసరం.. జన్మనిచ్చిన తల్లి, పుట్టిన ఊరు, దేశం, మాతృభాషను మర్చిపోకూడదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.  మాతృభాష కంటి చూపు లాంటింది.. ఆంగ్లభాష కళ్ల జోడు లాంటిదన్నారు వెంకయ్యనాయుడు.