ఇక్కడ ఇదే జరిగింది : పులి అని తెలియకపోతే.. పిల్లిలా ఆడుకోవచ్చు.. కొట్టొచ్చు.. గెలవొచ్చు..

ఇక్కడ ఇదే జరిగింది : పులి అని తెలియకపోతే.. పిల్లిలా ఆడుకోవచ్చు.. కొట్టొచ్చు.. గెలవొచ్చు..

అదో చిన్న జీవి..చిన్నదే కదా.. దీన్ని క్షణంలో గుటకాయస్వాహా చేసేద్దామనుకున్నాయి మూడు చిరుతలు. అయితే హీనంగా చూస్తే ఘోరంగా దెబ్బతింటామనే మాటను నిజం చేసి చూపించింది ఓ చిన్నప్రాణి. మూడు చిరుతల్ని చెడుగుడు ఆడేసి పలాయనం చిత్తగించేలా చేసింది. చుట్టుముట్టిన మూడు చిరుతలపై తన శక్తికి మించి పోరాడి క్రూరజంతువులకు చుక్కలు చూపెట్టింది.

చిన్నదే కదా అని తక్కువగా చూడొద్దు

హనీ బాడ్జర్ అనే చిన్నజంతువు మూడు చిరుతలతో పోరాడిన వీడియోను చూస్తే చిన్నదే కదాని తక్కువ అంచనావేయొద్దు అనే మాట గుర్తుకొస్తుంది. మూడు చిరుతల్లో ఒకటి పెద్దది. మరో రెండు మరీ చిన్నవి కాదు అవికూడా పెద్దగానే ఉన్నాయి. హనీ బాడ్జర్ చిన్నదే అయినా శత్రువుల ముందు లొంగిపోలేదు. చిరుత పులులు కూడా దీన్ని ఏమీ చేయలేకపోయాయి.  పైగా ఏ జంతువును చూసినా ఇది ఏ మాత్రం భయపడిపోదని ఐఎఫ్ఎస్ అధికారి  సుశాంత నందా తెలియజేశారు. హనీ బాడ్జర్ ఓ మూడు చిరుత పులులతో పోరాడుతున్న వీడియో క్లిప్ ను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

చిరుతలకు చుక్కలు చూపించిన చిరుప్రాణి

చిరుత పులి వేట గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. వాయువేగంతో పరుగెత్తే జింకను కూడా నోటకరిచి చెట్టుమీదకు ఈజీగా లాక్కుపోయి తాపీగా విందారగిస్తుంది. అటువంటివి మూడు చిరుతలు  కలిస్తే ఏనుగునైనా అంతమొందించేస్తాయి. కానీ ఓ చిరుప్రాణిని మాత్రం ఏమీ చేయలేకపోయాయి. మూడు చిరుతలకు ఒకే ఒక్క చిన్నప్రాణి చుక్కలు చూపించిన వీడియోను ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా షేర్ చేశారు.

చిరుతతో సై అన్న హనీ బాడ్జర్

హనీ బాడ్జర్‌ను ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతమైన జంతువు అని పిలుస్తారు.ఎందుకంటే ఇది తనకంటే చాలా పెద్ద జంతువులపై దాడి చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయదు.
సింహాలు, పులులు, మొసళ్లు, ఇంకా ఎంత పెద్ద జంతువులతోనైనా ఇవి యుద్ధానికి సిద్ధం అని అంటుంటాయి.ఇందుకు కారణం హనీ బాడ్జర్‌ చర్మం చాలా దృఢంగా ఉంటుంది.  పంజాతో బలంగా కొట్టినా.పదునైన ఆయుధంతో పొడిచినా దీని శరీరంలోకి మిల్లీమీటర్ కూడా అవి దిగలేవు.వీటి శరీరంపైన ఉండే తోలు మందం దాదాపు 6 మిమీ ఉంటుంది. ఇది చాలా గట్టిగా ఉంటుంది. పొట్టి, బలమైన కాళ్లతో బలిష్టమైన, చదునైన శరీరాన్ని కలిగి ఉండే ఇవి దేనిపై పోరాడినా గెలుపే సాధిస్తాయి.వదులుగా ఉండే దీని మందపాటి చర్మాన్ని ఎంత పదునైన పళ్ళతో కొరికినా అవి దాని శరీరంలోకి వెళ్లలేవు. ఈ విషయం తెలియక మూడు చిరుతపులులు దాన్ని చంపేసి తినేయాలని అనుకున్నాయి.కానీ సీన్ రివర్స్ అవడంతో బతుకు జీవుడా అంటూ పారిపోయాయి.వీటి మధ్య జరిగిన పోరాటానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ వీడియో చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో నీటి మడుగు వద్ద తల్లి చిరుతతో కలిసి రెండు పిల్ల చిరుతలు ఒక హనీ బాడ్జర్‌ను అత్యంత పాశవికంగా పళ్లతో కొరికాయి.తల్లి చిరుత బాడ్జర్‌ మెడను గట్టిగా కొరికింది.దాని పక్కనే ఉన్న పిల్ల చిరుత పులులు సైతం బాడ్జర్‌ వెనుక భాగంలో బలంగా కరిచాయి.ఈ క్రమంలో ఆ బాడ్జర్‌ వాటి నుంచి విడిపించుకునేందుకు తన వెనుక కాళ్లతో తన్నుతూ ఉంది. ఆ తర్వాత వాటి నుంచి విడిపించుకొని ఎదురుదాడికి దిగింది.పెద్ద చిరుత పులితో సహా రెండు కుర్ర చిరుతలను కూడా అది పరిగెత్తించింది. చాలాసేపు ఈ చిరుతలు దానిపై దాడి చేసినా దానికి చిన్న గాయం కూడా కాలేదు.ఒక్క రక్తపు బొట్టు కూడా నేల జారలేదు.చివరికి మూడు చిరుతలపై ఎదురుదాడి చేసి ఈ హనీ బాడ్జర్‌ పైచేయి సాధించింది.అనంతరం అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయింది.

హనీ బాడ్జర్ అనేది భయమే లేని జంతువు. వాటి చర్మం చాలా మందంగా ఉంటుంది. పైగా చాలా లూజుగా కూడా ఉంటుంది. వాటి శరీర ఆకృతిని బట్టి చూస్తే అదే వాటినికి ప్లస్ పాయింట్. శత్రువుల నుంచి ప్రాణాలు కాపాడుకోవటానికి. క్రూర జంతువల దాడి నుంచి కూడా సునాయాసంగా తప్పించుకోగలవు. మెడ దగ్గర పట్టుకున్నా సరే అవి విడిపించుకోగలవు. పాముల విషం, తేళ్ల కాటుల నుంచి వీటికి రక్షణ ఉంటుంది అని వివరించారు సుశాంత నందా. మరీ మూడు చిరుతల్ని చెడుగుడు ఆడేసి చుక్కలు చూపించిన ఈ చిచ్చరపిడుగులాంటి హీనా బాడ్జర్ వీరత్వంపై పోరాట పటిమపై మీరు కూడా ఓ లుక్కేయండీ..ఈ వీడియో చూస్తే హనీ బాడ్జర్ కు శరీర నిర్మాణం ఎంత సేఫ్టీయో అర్థమవుతుంది.

https://twitter.com/susantananda3/status/1654166213696815107