
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీలో కొత్త కోణం బయటపడింది. ఓ యువతి కోసం టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందులో టీఎస్ పీఎస్ సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ ను కీలక నిందితుడిగా గుర్తించారు పోలీసులు.
టీఎస్ పీఎస్ సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కోసం ఓ యువతి తరచూ ఆఫీస్ కు వచ్చి పోతుండేది. ఆ యువతితో ప్రవీణ్ సన్నిహితంగా ఉండేవాడు. ఓ రోజు పేపర్ ఇవ్వాలని యువతి కోరడంతో ప్రవీణ్ పేపర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ వల్లే పేపర్ యువతికి చేరిందని .. హ్యాక్ కాలేదని పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.
మార్చి 12న జరగాల్సిన టీపీబీవో( టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ) రాతపరీక్ష, 15, 16వ తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాతపరీక్షను వాయిదా వేస్తున్నట్లుగా టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. వాయిదాపడ్డ పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది. హ్యాకింగ్‌పై టీఎస్‌పీఎస్సీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా పేపర్ లీక్ వెనుక టీఎస్ పీఎస్ సీ ఉద్యోగి హస్తం ఉందని గుర్తించింది.