
కౌలూన్ : హాంకాంగ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో ఇండియా పోరాటం ముగిసింది. బరిలో ఉన్న ప్లేయర్లందరూ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టారు. గురువారం జరిగిన విమెన్స్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి గోపీచంద్–ట్రిసా జోలీ 8–21, 14–21తో ఏడోసీడ్ అప్రియాని రహయు–సిటి ఫడియా సిల్వ రమదంతి (ఇండోనేసియా) చేతిలో ఓడారు. కేవలం 36 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ జోడీ ర్యాలీలు, స్మాష్‌లు ఆడటంలో ఫెయిలైంది. మరో మ్యాచ్‌లో అన్‌సీడెడ్ తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప 18–21, 7–21తో టాప్‌సీడ్ మయు ముట్సుమోటో–వకనా నగహర (జపాన్) చేతిలో కంగుతిన్నది. 38 నిమిషాల మ్యాచ్ తొలి గేమ్‌లో గట్టి పోటీ ఇచ్చిన తనీషా–అశ్విని రెండో గేమ్‌లో చతికిలపడ్డారు.