మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం.. ఎస్‌‌‌‌ఆర్ కాలేజీ మల్లంపేట క్యాంపస్లో ఈవెంట్

మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం.. ఎస్‌‌‌‌ఆర్ కాలేజీ మల్లంపేట క్యాంపస్లో ఈవెంట్

మెహిదీపట్నం, వెలుగు: నీట్​-2025లో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించిన విద్యార్థులను హైదరాబాద్​లోని ఎస్‌‌‌‌ఆర్ కాలేజీ మల్లంపేట క్యాంపస్​లో సన్మానించారు. ఎస్ఆర్ కాలేజీల విభాగంలో రెగ్యులర్ ఇంటర్ తో పాటుగా నీట్ కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో 68 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారు.

వీరిని ప్రత్యేకంగా ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్స్ మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సీఈవో  సురేందర్ రెడ్డి, నీట్ కోఆర్డినేటర్ సుధాకర్, డీజీఎలు భగవాన్ రెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రీనివాస్  అభినందించారు. ఉన్నతమైన కోచింగ్, సీనియర్ అధ్యాపకుల బోధన, వీకెండ్ పరీక్షలు, స్టడీ అవర్స్​తో ఈ విజయం సాధ్యమైందని చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో జోనల్స్, డీన్స్, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.