మీరట్-ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవేపై డంపర్ను ఢీకొట్టిన కారు..ముగ్గురి మృతి

 మీరట్-ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవేపై డంపర్ను ఢీకొట్టిన కారు..ముగ్గురి మృతి

ఘజియాబాద్: ఘజియాబాద్ లోని మీరట్ -ఢిల్లీ ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 11 మంది విద్యార్థులతో వెళ్తున్న కారు.. హైవేపై నిలిపివున్న డంపర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులతో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబం ధించిన సీసీటీవీ పుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్చి 30న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న స్కూల్ ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ALSO READ | రథోత్సవంలో అపశృతి.. ఐదేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడంటే..

హైవేపై అతివేగంతో వెళ్తున్న కారు.. హైవేకు కుడివైపున లైన్ లో ఆగి వున్న డంపర్ ను ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. అనంతరం ఆ కారుడు హైవేపై మరో లైన్ లో వెళ్తున్న ట్రక్ ను ఢీకొటడంతో అది బోల్తా పడింది. ప్రమాదం తర్వాత డంపర్ డ్రైవర్ పారిపోయినట్లు తెలుస్తోంది.. నిందితుడికోసం ఘజియా బాద్ పోలీసులు గాలింపు చేపట్టారు. 

ప్రాణాలు కోల్పోయిన  ఇద్దరు విద్యార్థులు ఉనేష్, ఆజం గా గుర్తించారు. వీరిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరో తొమ్మిది మంది విద్యార్థులను సమపీంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.