
గండిపేట్, వెలుగు: ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు హార్స్ రైడర్లు, ఒక గుర్రం మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ ఏరియాలో జరిగింది. కిషన్‌బాగ్ చిరాక్ లైన్ ప్రాంతానికి చెందిన అక్రం.. కిస్మత్‌పూర్ టైమ్స్ స్కూల్ ప్రాంతంలో హార్స్ రైడింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. అతని కొడుకు మహ్మద్ సైఫ్(18) ట్రైనింగ్ ఇచ్చేవాడు. వీరివద్ద యూపీకి చెందిన ఆషూ సింగ్(19) హార్స్ రైడర్‌గా ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం రైడ్ చేస్తూ ఆషూ సింగ్ ఈసీ కాలువ వద్దకు వెళ్లి గుర్రంతో సహా కాలువలోపడ్డాడు. అతన్ని కాపాడేందుకు సైఫ్ నీటిలోకి దిగి అతడూ మునిగిపోయాడు.