
ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టల్స్ మరియు మెస్‌లు రేపటి నుంచి మూసివేస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. అందువల్ల రేపు మధ్యాహ్నంలోపు విద్యార్థులందరూ హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా హాస్టల్స్ మరియు మెస్‌లు మూసివేస్తున్నామని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. విద్యాసంస్థలన్నీ మూసివేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. దాంతో విద్యాసంస్థలన్నీ మూతపడుతున్నాయి.