క్వారంటైన్ సెంటర్లుగా యూనివర్సిటీ హాస్టల్స్

క్వారంటైన్ సెంటర్లుగా యూనివర్సిటీ హాస్టల్స్

చండీగఢ్: దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న మేరకు ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. కరోనా పేషెంట్లను ఉంచేందుకు వీలుగా పంజాబ్ యూనివర్సిటీలోని హాస్టళ్లను క్వారంటైన్ సెంటర్లుగా మార్చాలని ఆదేశించింది. ‘‘వర్సిటీలోని నాలుగు హాస్టల్స్ ను ఖాళీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే రెండు హాస్టల్ బిల్డింగ్​లను రెడీ చేశాం”అని యూనివర్సిటీ డీన్ ఎమాన్యువల్ నహర్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే కరోనాపై అవగాహన కల్పించేలా పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ పోర్టల్ ను ప్రారంభించింది. ఈ వెబ్​సైట్ లో కరోనా లక్షణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాస్కుల వాడకం, సోషల్ డిస్టెన్సింగ్ ప్రాముఖ్యతను తెలిపేలా వెభ్ సైట్ లో సమాచారాన్ని పొందుపరిచారు. చండీగఢ్ లో ఇప్పటివరకు మొత్తం 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.