మీరు రౌడీలా.. బిర్యానీ కస్టమర్లను కర్రలతో కొట్టిన రెస్టారెంట్ సిబ్బంది

మీరు రౌడీలా.. బిర్యానీ కస్టమర్లను కర్రలతో కొట్టిన రెస్టారెంట్ సిబ్బంది

 హైదరాబాద్ అబిడ్స్ లో తీవ్ర ఉద్రక్తత చోటుచేసుకుంది. బిర్యానీ తినడానికి వచ్చిన కస్టమర్ కాస్త తల పలగొట్టుకొని వెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్ లోని ఓ హోటల్ లో బిర్యానీ తిందామని దూల్ పేటకు చెందిన కొందరు వ్యక్తులు వెళ్లారు. డైనింగ్ టేబుల్ పై కూర్చొని మటన్ బిర్యాని ఆర్డర్ చేశారు.  అయితే బిర్యానీలో, మటన్ సరిగ్గా ఉండకలేదని కస్టమర్లు హోటల్ సిబ్బందికి చెప్పారు.

 అయినా హోటల్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో తాము పూర్తి డబ్బులు చెల్లించమని హోటల్ వెయిటర్లతో వాగ్వాదానికి దిగారు. దింతో ఇరు గ్రూపులు వాదించికున్నారు. వాగ్వాదం కాస్త  గొడవకు దారి తీసింది. హోటల్ వెయిటర్ల పై దాడికి దిగడంతో... వెయిటర్లు  కస్టమర్ల పై కర్రలతో దాడి చేశారు. రక్తాలు వచ్చేలా కస్టమర్లను వెయిటర్లంతా కలిసి కొట్టారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గొడవను సద్దుమనిపించే ప్రయత్నం చేశారు. 

కస్టమర్లకు తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. హోటల్ యజమాని పై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విడియో కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది. బిర్యానీ తినడానికి వస్తే తలకూడా పగలగొడతారా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది మీరు రౌడీలా వెయిటర్ల అని మండిపడుతున్నారు.