హోటళ్లు, రెస్టారెంట్లకు మళ్లీ పెరిగిన గిరాకీ

హోటళ్లు, రెస్టారెంట్లకు మళ్లీ పెరిగిన గిరాకీ

కరోనా ఎఫెక్ట్, లాక్ డౌన్ తో  డీలా పడ్డ హోటళ్లు, రెస్టారెంట్లకు మళ్లీగిరాకీ పెరుగుతోంది. మెల్లమెల్లగా బిజినెస్ పుంజుకుంటోంది. టేక్అవేతో పాటు రెస్టారెంట్లలోనే కూర్చుని భోజనం చేసేందుకు (డైన్ ఇన్) కస్టమర్లు ముందు కొస్తున్నారు. లాక్డౌన్ కు  ముందు నాటితో పోలిస్తే 30–4 0 శాతం దాకా బిజినెస్ రికవరీ అయిందని హోటళ్లు, రెస్టారెం ట్ల నిర్వాహకులు చెప్తున్నారు. కొద్ది రోజుల్లో పరిస్థితి పూర్తిగా సెట్ అవుతుందని అనుకుంటున్నారు. లాక్డౌన్ టైంలో స్టాఫ్ సొంతూర్లకు  వెళ్లిపోయార ని, కొద్దిమందితోనే నడిపిస్తున్నామని చెప్తున్నారు. అన్ని జాగ్రత్తలతో ఫుడ్ సర్వ్ చేస్తున్నామన్నారు.

ఇప్పుడిప్పుడే..

కరోనాతో రెండున్నర నెలల పాటు హోటల్స్, రెస్టారెం ట్లుక్లోజ్ అయ్యాయి. జూన్ 8 నుంచి రీ ఓపెన్ అయ్యాయి. తొలుత చాలా వరకు రెస్టారెం ట్లను ఓపెన్ చెయ్యలేదు. గిరాకీ ఎలా ఉంటుందో లేదో, తెరిస్తే మెయింటెనెన్స్కు సరిపడా ఇన్కం అయినా వస్తుందా అన్న సందేహం, స్టాఫ్ అంతా సొంతూర్లకు  వెళ్ళిపోవడం  వంటి కారణాలతో తెరవలేదు. ఓపెన్ చేసిన రెస్టారెంట్లలో సేఫ్టీ ప్రికాషన్స్ తో డైన్ ఇన్ అందుబాటులోకి తెచ్చినా జనం ఇంట్రెస్ట్ చూపించలేదు. కొంతమేర టేక్ అవే, ఆన్లైన్ ఆర్డర్స్  వచ్చాయి. వాటిపైనే ఆధారపడి రెస్టారెంట్స్, కెఫేలు, హోటల్స్ నడిచాయి. అయితే 15, 20 రోజులుగా డైన్ ఇన్ కు వచ్చే కస్టమర్లు పెరుగుతున్నారు. ప్రస్తుం 50 శాతం హోటల్స్, రెస్టారెంట్స్, కెఫేలలో టేక్ అవే తోపాటు డైన్ ఇన్ ఫెసిలిటీ ఉందని.. 35 శాతం దాకా బిజినెస్ రికవరీ అయిందని మేనేజ్మెంట్లుచెప్తున్నాయి. ఓపెన్ చేసిన హోటళ్లు, రెస్టారెం ట్లలోనూ కరోనా రూల్స్ప్రకారం.. 50 శాతం కెపాసిటీతోనే డైన్ ఇన్ కల్పిస్తున్నామని తెలిపాయి.

సేఫ్టీ ప్రికాషన్స్ తో..

గిరాకీ పెంచుకోవడం, కస్టమర్లకు  సేఫ్టీ కల్పించడం కోసం రెస్టారెంట్లు, హోటళ్లు అన్ని జాగ్రత్తలు చేపడుతున్నాయి. టేబుల్స్ మధ్య డిస్టెన్స్, స్టాఫ్ కు మాస్కులు, షీల్డ్లు, గ్లౌజులు, కిచెన్ లో సేఫ్టీ ఏర్పా ట్లు చేశామని రెస్టారెం ట్ల నిర్వాహకులు చెప్పారు. అలాగే డిస్పోజబుల్ మెన్యూకార్డులు, సెల్ఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామన్నారు. ప్రస్తుం ఒక్కో రెస్టా రెంట్కు రోజు సగటున 40 నుంచి వంద మంది వరకు కస్టమర్లు వస్తున్నారని.. 10 నుంచి 15 టేబుల్స్ ఫుల్ అవుతున్నాయని తెలిపారు.

 హైదరాబాద్ సిటీలో కెఫేలకు..

హైదరా బాద్లో డిఫరెంట్ థీమ్‌లతో కెఫేలు ఉండటంతో యూత్, ఫ్యామిలీలు వాటికి వెళ్లేందుకు ఇంట్రెస్ట్చూపిస్తున్నారు. మంచి యాంబియె న్స్, క్లీన్ కల్ నెస్, మంచి సర్వింగ్, వివిధ రకాల ఫుడ్ ఒకేచోట లభించే వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. కెఫేల్లో సోషల్ డిస్టెన్స్, సింగిల్ కాంటాక్ట్ సర్వీస్ ఉంటుందని.. క్రియేటివ్ యాంబియన్స్ వల్ల మంచి ఫీల్ ఉంటుందని కస్టమర్లు అంటున్నారు.

స్టాఫ్ కొరతతో..

రాష్ట్రంలోని హోటల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నవారిలో మహారాష్ట్ర, ఒడిశా, బీహార్, చత్తీస్ గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వాళ్లు ఎక్కువ. లాక్డౌన్ టైంలో వాళ్లంతా సొంతూర్లకు  వెళ్లిపోయారు. ఇప్పుడు అన్లాక్మొదలైనా వాళ్లలో చాలా మంది వచ్చే పరిస్థితి లేదు. ట్రాన్స్పోర్టేష న్ సమస్య వల్ల రాలేకపోతున్నారని హోటల్ నిర్వాహకులు అంటున్నారు. హైదరాబాద్‌లో, వివిధ జిల్లాల నుంచి వచ్చిన స్టాఫ్తో నడిపిస్తున్నామని చెప్తున్నారు. కిచెన్ నుంచి నేరుగా టేబుల్ సర్వింగ్‌కు సింగి ల్ కాంటాక్ట్ సిస్టంని ఫాలో అవుతున్నామని అంటున్నారు.