వేడెక్కువైతే ముందస్తు కాన్పులు పెరుగుతయ్

వేడెక్కువైతే ముందస్తు కాన్పులు పెరుగుతయ్
  • కూల్ వాతావరణంలోనే..అమ్మ కడుపు సల్లగుంటది
  • తొమ్మిది నెలలకు ముందేపుట్టే బిడ్డలకు హెల్త్ ప్రాబ్లమ్స్
  • తెలివితేటలూ తగ్గే చాన్స్ అమెరికా రీసెర్చర్ల వార్నింగ్

మనం అమ్మ కడుపులో ఎన్ని దినాలుంటం? మామూలుగా అయితే 280 రోజులు. లేదా 40 వారాలు. లేదా 9.2 నెలలు. కానీ కొందరు అంతకు ముందే పుట్టేస్తుంటరు. అలాంటోళ్లను..సరదాగా ‘‘నెల తక్కు వోడా..” అని పిలుస్తూ ఆటపట్టిస్తుంటాం . వాతావరణంలో వేడికి, మనం పుట్టే రోజుకు లింకు ఉందంటున్నారు అమెరికా రీసెర్చర్లు! వేడి వాతావరణం వల్ల మనం అమ్మ కడుపులో ఉండే రోజులు తగ్గుతాయని, వాతావరణం కూల్ గా ఉంటే అమ్మ కడుపులో ఎక్కు వ రోజులు ‘చల్లగా’ ఉంటామని చెప్తు న్నారు! హీట్ వెదర్ వల్ల ముందస్తు కాన్పులు పెరుగుతాయని తేల్చి న ఈ స్టడీ వివరాలు ఇటీవల ‘నేచర్ క్లైమేట్ చేంజ్’ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి.

స్టడీలో ఏం తేలిందంటే…

నెలలు నిండిన గర్భిణులు హీట్ వెదర్ లో ఉంటే వారికి గుండె సంబంధమైన ఒత్తిడి పెరుగుతుందని రీసెర్చర్లు గుర్తించారు. అలాగే పురిటి నొప్పులకు సహాయ పడే ఆక్సిటోసిన్ హార్మోన్ ముందస్తుగానే,ఎక్కువగా విడుదలవుతుందని గమనించారు. ఈ రెండింటి వల్ల మామూలు టైం కన్నా ముందే కాన్పులవుతున్నాయని కనుగొన్నారు. అమెరికాలోని వివిధ కౌంటీల్లో 445 ప్రాంతాల్లోని హాస్పిటళ్లలో 1969, 1988 మధ్య జరిగిన కాన్పుల వివరాలను ఈ రీసెర్చ్ లో భాగంగా స్టడీ చేశారు. ఈ టైం పీరియడ్ లో 5.6 కోట్ల కాన్పులు జరిగాయని రికార్డులను బట్టి తెలిసింది. ఆయా రోజుల్లో ఆ ప్రాంతాల్లో టెంపరేచర్లనూ పరిశీలించా రు. టెంపరేచర్ లు15 నుంచి 21 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉన్న రోజుల కన్నా 32 డిగ్రీలకు మించిన రోజుల్లో కాన్పులు ప్రతి లక్ష ప్రసవాల్లో 0.97% పెరిగినట్లు తేలింది. యావరేజ్ బర్త్ రేట్ తో పోలిస్తే ఇది 5% ఎక్కు వగా ఉన్నట్లు తెలిసింది. మొత్తంగా ఈ టైం పీరియడ్ లో ఏటా25 వేల ముందస్తు కాన్పులు జరిగాయని అంచనా వేశారు.

గ్లోబల్ వార్మింగ్ కంట్రోల్ చేయాలె

కార్బన్ మిషన్స్ ఇట్లాగే కొనసాగితే, గ్లోబల్ టెంపరేచర్లు ఇంకా పెరుగుతాయని, దాంతో ముందస్తు కాన్పు ల ముప్పూ ఎక్కు వైతదని నిపుణులు హెచ్చరించారు. కార్బన్ ఎమిషన్స్ ను కంట్రోల్ చేయకపోతే..కేవలం ఈ స్టడీ జరిగిన ప్రాంతాల్లోనే 2080 –2099 నాటికి ఏటా42 వేల ముందస్తు కాన్పులు జరుగుతాయన్నారు.