రాహుల్ ఓయూ పర్యటనపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

రాహుల్ ఓయూ పర్యటనపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

రాహుల్ ఓయూ పర్యటన అనుమతి పంచాయతీ కొనసాగుతోంది. ఆరునూరైనా రాహుల్ ఓయూకి వెళ్తారని కాంగ్రెస్ చెబుతుంటే..ఎలా వెళ్తారో చూస్తామని టీఆర్ఎస్ సవాల్ చేస్తుంది. ఇద్దరి మధ్యమాటల యుద్ధం నడుస్తోంది.  మరికాసేపట్లో హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఓయూజేఏసీ విద్యార్థి నాయకులు .రాహుల్ గాంధీ విద్యార్థులతో ఇంటరాక్షన్ కు సంబంధించి అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ఓయూ రాకపై అనుమతి నిరకరించింది ఓయూ విసి. ఈ నెల 7న ఓయూలో విద్యార్థులతో రాహుల్ ముఖాముఖీ నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. స్వరాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలను ఏళ్లతరబడి సజీవంగా ఉంచిన ఓయూ జీవచ్ఛవాన్ని తలపిస్తోందని ట్వీట్ చేశారు.శత వసంతాల సామాజిక చైతన్య వేదిక సమాజానికి దూరమై ఒంటరితనాన్ని అనుభవిస్తోందన్నారు. ఓయూలో భావ ప్రకటనా స్వేచ్ఛనే కాదు..ప్రజాస్వామ్యాన్ని కూడా ప్రభుత్వం హత్య చేస్తోందన్నారు.  ఇది మేథావుల ఆందోళన అంటూ ట్వీట్ చేశారు రేవంత్.