బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే వరకు ఇంట్లో చోరీ

బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే వరకు ఇంట్లో చోరీ

ఎల్​బీ నగర్​, వెలుగు:  బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేలోపు ఇంట్లో చోరీ జరిగి 17 తులాల బంగారం అపహరించిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైదేహినగర్‌లో జరిగింది. పోలీసులు , బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..  వైదేహినగర్‌కు చెందిన టీవీ సుబ్రహ్మణ్యం (68).. ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. 

అతని కుమార్తె అమెరికా నుంచి మణికొండలోని బంధువుల ఇంటికి వస్తుండటంతో, కుటుంబ సభ్యులంతా వెళ్లారు.  సోమవారం తిరిగి ఇంటికి వచ్చేసరికి..  ఇంటి  తలుపుల  తాళాలు పగలగొట్టి ఉన్నట్లు గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా..  బీరువాలో ఉన్న 17 తులాల బంగారు ఆభరణాలను  దోచుకెళ్లినట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదుతో  పోలీసులు కేసు  దర్యాప్తు ప్రారంభించారు.