
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కెరీర్‌లో ‘హౌజ్‌ఫుల్’ ప్రాంచైజీకి అంటూ ఓ ప్రత్యేకస్థానం ఉంది. ఇప్పటికే ఈ కామెడీ సిరీస్‌లో వచ్చిన నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి. తాజాగా ఐదో సినిమాను అనౌన్స్ చేశారు. సాజిద్ నడియడ్ వాలా నిర్మిస్తున్న ఈ సినిమాని దోస్తానా ఫేమ్ తరుణ్ మన్సుఖాని డైరెక్ట్ చేస్తున్నాడు. రితేష్ దేశ్‌ముఖ్‌తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ ఇందులో నటించబోతున్నారు. వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయబోతున్నట్టు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ మూవీ త్వరలో సెట్స్‌కు వెళ్లనుంది. ఇలా ఒకే ప్రాంచైజీలో ఐదో సినిమా తెరకెక్కుతుండటం బాలీవుడ్‌లో ఇదే ఫస్ట్‌టైమ్. ఇక గత కొంతకాలంగా వరుస ప్లాపుల్లో ఉన్నాడు అక్షయ్. ఆయన నటించిన ‘ఓ మై గాడ్’ సీక్వెల్ ‘ఓ.ఎమ్.జి 2’ ఆగస్టు 11న విడుదల కానుంది. అలాగే పరిణీతి చోప్రాతో కలిసి నటించిన ‘ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ’ చిత్రం అక్టోబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఇవి కాకుండా రోహిత్ శెట్టి తీస్తున్న ‘సింగం ఎగైన్’లో అజయ్ దేవగన్‌తో కలిసి అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు.