కాగితాలపైనే ఇళ్లు కట్టారు: సీఎం కేసీఆర్

కాగితాలపైనే ఇళ్లు కట్టారు: సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో అద్భుత పురోగతి సాధించామన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్‌ పాలనలో మైనర్‌ ఇరిగేషన్‌ ధ్వంసమైందన్నారు. తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా తవ్వలేదన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. FRBMకు లోబడే అప్పులు తీసుకుంటున్నామన్నారు. తాము అప్పు చేసి పప్పు కూడు తినడం లేదన్నారు. చేసే అప్పు నీటి కోసమేనని చెప్పారు. అందరికీ రక్షిత తాగు నీరు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. గోదావరినుంచి 4 వందల TMCల నీరు తీసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా ఇళ్లు కాగితాల పైనే కట్టారని… వాస్తవంగా లేవని చెప్పారు. ఇళ్లు కట్టకుండానే నిధులు కాజేశారన్నారు. వారి లెక్కల ప్రకారం ఇళ్లు కట్టాల్సిన అవసరమే లేదని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌ నాయకులు అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు సీఎం కేసీఆర్. ప్రజలకు మేలు చేయడమే తమ లక్ష్యమన్నారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయాలన్నదే తమ ధ్యేయమని చెప్పారు. కేంద్రాన్ని నిధులు కోరినా ఇవ్వడం లేదన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదన్నారు సీఎం కేసీఆర్.