టూవీలర్ డ్రైవింగ్ స్కూల్స్ కు పెరుగుతున్న రెస్పాన్స్

టూవీలర్ డ్రైవింగ్ స్కూల్స్ కు పెరుగుతున్న రెస్పాన్స్
  • టూ వీలర్​ లెర్నింగ్​పై గృహిణుల ఇంట్రెస్ట్ 
  • టూవీలర్ డ్రైవింగ్ స్కూల్స్ కు పెరుగుతున్న రెస్పాన్స్
  • పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ కంటే సొంత వెహికల్ బెటరని

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ తర్వాత నుంచి మహిళల్లో  టూ వీలర్ లెర్నింగ్​పై ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. కరోనా తర్వాత  వెహికల్ నేర్చుకుంటున్నవాళ్లలో 70 శాతానికి పైగా గృహిణులే ​ఉంటు
న్నారు.  టూవీలర్ డ్రైవింగ్ స్కూళ్లలో చేరి నేర్చుకుంటున్న వాళ్లు డబుల్ అయ్యారని ట్రైనర్లు చెబుతున్నారు. లాక్ డౌన్ తర్వాత పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ కన్నా ప్రైవేట్, సొంత వెహికల్​పైనే వెళ్లడం మంచిదని చాలామంది భావించారు. తమకు అందుబాటులో ఉన్న స్కూటీ డ్రైవింగ్ స్కూల్​ని చూసుకుని జాయిన్ అయిపోతున్నారు. సిటీలో పదులసంఖ్యలో ట్రైనింగ్ స్కూల్స్ ఉండగా, ఒక్కో చోట 20 నుంచి 25 మంది వరకు శిక్షణ పొందుతున్నారు. ప్రతిరోజు స్కూటీ నేర్చుకునేందుకు అరగంట, 40 నిమిషాలను కేటాయిస్తున్నామని లెర్నర్స్ చెప్తున్నారు. 

డబులైన లెర్నర్స్..
స్కూళ్లు, కాలేజీలు, ఆఫీస్‌‌‌‌లు అన్నీ ఓపెన్ అయ్యాయి.  చిన్న అవసరాలకు ఇంట్లోని మగవారిపై ఆధారపడడం కంటే  సొంతంగా చేసుకోవాలని భావిస్తున్నారు. పిల్లలను స్కూళ్లలో దింపడం, తీసుకురావడం, సరుకులు తెచ్చుకోవడం ఇలా ఇతర పనులమీద బయటకు వెళ్లడం వంటి వాటి కోసమే స్కూటీని నేర్చుకుంటున్నారు మహిళలు. ఇలా నేర్చుకుంటున్నవాళ్లలో వర్కింగ్ విమెన్స్ తో పాటు గృహిణులు కూడా ఉంటున్నారు. మొత్తం లెర్నర్స్ లో గృహిణులే 70శాతానికిపైగా ఉంటున్నారని ఓనర్లు చెప్తున్నారు. ప్రస్తుతం స్కూళ్లు ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్ ప్రొవైడ్ చేయకపోవడం, ఆటో కిరాయిలు డబులైపోవడంతో స్కూటీ లెర్నింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డ్రైవింగ్ స్కూల్ ఓనర్లే తమ సొంత స్కూటీలతో ట్రైనింగ్ ఇస్తున్నారు. కోర్సులు 10 రోజులు, 15 రోజుల  లెక్కన ఉంటాయి. ఇందుకోసం 3 వేల నుంచి 6 వరకు చార్జ్ ​చేస్తున్నారు. స్కూటీ నేర్చుకోవాలని వచ్చే వారికి నార్మల్ బైక్​తో ట్రైనప్ చేసి ఆ తర్వాత స్కూటీ ఇచ్చి డ్రైవ్ చేయిస్తున్నారు. 

నేర్చుకుంటున్న వాళ్లు ఎక్కువైన్రు
టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్నా. మొదట్లో ఎవరూ వచ్చేవారు కాదు. ఇప్పుడంతా ఆన్​లైన్​అయిపోవడంతో ఇంటర్నెట్​లో సెర్చ్ ​చేసి ఫోన్ చేస్తున్నారు.  ఇంట్లో వాళ్ల సపోర్ట్​తో నేర్చుకుంటున్నవాళ్లు ఎక్కువయ్యారు. డైలీ 40 నిమిషాలు ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. 
- సంతోషి, డ్రైవింగ్ స్కూల్ ఓనర్, గుడిమల్కాపూర్

నా పనులు నేనే చేసుకుంటున్నా..
మా వారు ఆఫీస్ వర్క్​లో బిజీగా ఉంటారు. నేను సూపర్ మార్కెట్​కి వెళ్లాలన్నా, బాబును స్కూల్​లో దింపాలన్నా ఇబ్బందిగా ఉండేది. అందుకే స్కూటీ నేర్చుకుంటున్నా. మొదట్లో భయం వేసింది. డ్రైవింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యా.   ఇప్పుడు ఒకరి సపోర్ట్ లేకుండా బయటకు వెళ్లి వస్తున్నా. 
- మమత, గృహిణి, చందానగర్