Women's ODI World Cup 2025: సెంచరీతో జెమీమా అసాధారణ పోరాటం.. రసవత్తరంగా మారిన సెమీస్

Women's ODI World Cup 2025: సెంచరీతో జెమీమా అసాధారణ పోరాటం.. రసవత్తరంగా మారిన సెమీస్

మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుతంగా ఆడుతోంది. అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని అసాధారంగా పోరాడుతూ మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో పాటు జెమీమా రోడ్రిగ్స్ భారీ భాగస్వామ్యంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది. ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జెమీమా అజేయ సెంచరీ (100)తో ఇండియా విజయం కోసం పోరాడుతోంది.  కౌర్, జెమీమా మూడో వికెట్ కు 167 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించి ఆశలు సజీవంగా ఉంచారు. 

జెమీమా సెంచరీతో పాటు కౌర్ 89 పరుగులు చేయడంతో ప్రస్తుతం ఇండియా 42 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది, టీమిండి విజయానికి చివరి 48 బంతుల్లో 63 పరుగులు అవసరం. క్రీజ్ లో జెమీమా రోడ్రిగ్స్ (100), రిచా ఘోష్ (7) ఉన్నారు. 339 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభం లభించలేదు. సంవత్సరం తర్వాత జట్టులోల్కి వచ్చిన షెఫాలీ 10 పరుగులు మాత్రమే చేసి ఔటైంది. ఈ దశలో ఇండియాను ఆదుకునే బాధ్యత స్మృతి మందాన, రోడ్రిగ్స్ తీసుకున్నారు. వీరిద్దరూ పవర్ ప్లే లో ఆధిపత్యం చూపిస్తూ రెండో వికెట్ కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

24 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన మందాన ఔట్ కావడంతో టీమిండియా 59 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అయితే ఇక్కడ నుంచే అసలైన ఆట మొదలయింది. జెమీమా, హర్మన్ ప్రీత్ కౌర్ కలిసి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. మొదట ఆచితూచి ఆడిన వీరిద్దరూ ఆ తర్వాత క్రమంగా జోరు పెంచారు. అలవోకగా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో వీరిద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కౌర్ భారీ షాట్ కు ప్రయత్నించి సెంచరీ మిస్ అయినా.. జెమీమా సెంచరీ పూర్తి చేసుకుంది.