
- వచ్చే నెల 20న ఈ వేలం
హైదరాబాద్, వెలుగు: కేపీహెచ్బీలో 7 ఎకరాల 33 గుంటల భూమి వేలానికి హౌసింగ్ బోర్డు గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎకరానికి కనీస ధరను రూ.40 కోట్లుగా ఖరారు చేసింది. వేలంలో పాల్గొనే వాళ్లు ఎకరానికి రూ.50 లక్షల చొప్పున రూ. 7.50 కోట్లను వచ్చే నెల19 వరకు చెల్లించి రిజిస్ర్టేషన్ చేసుకోవాలని హౌసింగ్ బోర్డు ఎండీ విపి. గౌతమ్ తెలిపారు. ఈ ల్యాండ్ హైటెక్ సిటీకి వెళ్లే దారిలో లోధా, టాటా ఇండస్ టవర్స్ ఎదురుగా ఉందని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల 20న ఈ వేలం నిర్వహించనున్నట్టు చెప్పారు. .
ఈ వేలానికి సంబంధించి వచ్చే నెల 2న నాంపల్లిలోని గృహకల్ప హౌసింగ్ బోర్డు ఆఫీసులో ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహించనున్నట్టు ఆయన వివరించారు. ఈ వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు వెయ్యి కోట్లకు పైగా రెవెన్యూ రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.