మహిళ ఆరోగ్యమే కుటుంబానికి రక్ష : ఎంపీ గడ్డం వంశీకష్ణ

మహిళ ఆరోగ్యమే కుటుంబానికి రక్ష : ఎంపీ గడ్డం వంశీకష్ణ

పెద్దపల్లి, వెలుగు: మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబానికి, సమాజానికి రక్ష అని, ఇందుకోసం స్వస్త్​నారీ, సశక్త్​ పరివార్​ అభియాన్​ ప్రారంభించినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకష్ణ అన్నారు. ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెద్దపల్లి సివిల్​ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో బుధవారం ఎస్ఎన్ఎస్పీఏ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 

మహిళల ఆరోగ్యం రక్షణ, కుటుంబాల బలోపేతం, స్వశక్తీకరణపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని ఎంపీ పేర్కొన్నారు. సెప్టెంబర్​17 నుంచి అక్టోబర్​ 2 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వసతులను పరిశీలించారు. హాస్పిటల్​సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ శ్రీధర్​హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు అంబులెన్స్​ అవసరముందని ఎంపీ దృష్టికి తీసుకురాగా.. మంజూరు చేస్తానని వంశీకృష్ణ హామీ ఇచ్చారు. అంతకుముందు  ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంథనిలోని కాకా విగ్రహానికి ఎంపీ వంశీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

విశ్వకర్మ కార్పొరేషన్​ ఏర్పాటు అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా పెద్దపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణకారులు ఎంపీని శాలువాలతో ఘనంగా సన్మానించారు. గతంలో స్వర్ణకార సంఘ భవన నిర్మాణానికి నిధులు సమకూర్చింది కాకా వెంకటస్వామి అని గుర్తు చేశారు. 

 రూ.110 కోట్లతో కుందనపల్లి రైల్వే ఫ్లై ఓవర్​

గోదావరిఖని/మంథని, వెలుగు: రామగుండం–రాఘవాపూర్​ స్టేషన్ల మధ్య కుందనపల్లి 49 ఎల్‌‌‌‌‌‌‌‌సీ(రైల్వే గేట్​)వద్ద రూ.110 కోట్లతో రైల్వే ఫ్లైఓవర్​ బ్రిడ్జి నిర్మించనున్నట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. అమృత్ భారత్ స్కీమ్​ కింద రామగుండం రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించారు. ఎంపీకి రైల్వే ఆఫీసర్లు, కాంగ్రెస్​ లీడర్లు ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుందనపల్లి వద్ద ఫ్లై ఓవర్​నిర్మాణం ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అని అన్నారు. 

రెండు నెలల్లో టెండర్​ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానన్నారు. పెద్దంపేట వద్ద రైల్వే గేట్‌‌‌‌‌‌‌‌తో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నందున అక్కడ కూడా ఫ్లై ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి నిర్మించాలనే అంశం ప్రతిపాదనల్లో ఉందన్నారు. రామగుండంలో రూ.120 కోట్లతో ఈఎస్ఐ హాస్పిటల్​ టెండర్ ​దశలో ఉందని, త్వరితగతిన పనులు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్షను ఆదేశించినట్టు తెలిపారు. 

అనంతరం ఇటీవల వినాయక నిమజ్జనం సందర్భంగా గోదావరిలో పడి చనిపోయిన అక్బర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రాజేశ్​యాదవ్​ కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు. ఆయన వెంట లీడర్లు పి.మల్లికార్జున్​, గుమ్మడి కుమారస్వామి, అనుమాస శ్రీనివాస్​ (జీన్స్​), సత్యనారాయణ, విజయ్​, తిరుపతి, మధు, నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఉన్నారు.  అంతకుముందు మంథని సీవీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిరియాల సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన నివాసంలో ఎంపీ వంశీకష్ణ పరామర్శించారు.