వాట్సాప్ లో డిలీటైన చాట్ పొందండి ఇలా..

వాట్సాప్ లో డిలీటైన చాట్ పొందండి ఇలా..

దాదాపు వాట్సాప్ అంటే తెలియని వారే ఉండరు. డేటా షేర్ చేసుకోవడానికి, మెసేజ్ లు పంపించడానికి వాట్సాప్ ను సులభంగా వాడొచ్చు. ముఖ్యమైన ఫైల్స్, ఫొటోస్, వీడియోస్, చాట్ పంపించుకోవడానికి వాట్సాప్ సేఫ్ గాఉంటుంది. అయితే మీ ఫోన్ పోయినా, చెడిపోయినా మీకు ఇంపార్టెంట్ డేటా పొరపాటున డిలీటైనా వాట్సాప్ లో తిరిగి మళ్లీ పొందవచ్చు. ఈ విషయం చాలామందికి తెలియక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కోల్పోతుంటారు. అందరూ ఎక్కువగా వాడే వాట్సాప్ మెసెంజర్ యాప్ లో డిలెట్ అయిన డేటాను తిరిగి పొందవచ్చని చాలామందికి తెలియదు. వాట్సాప్ డేటా ఎలా బ్యాక్ అప్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

వాట్సాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ లో ఉన్న త్రి డాట్స్ పై క్లిక్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకొని అందులో చాట్ పై క్లిక్ చేయాలి. అక్కడ కిందకి స్క్రోల్ చేస్తే బాక్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది. దానితో పాటు ఇంక్లూడ్ వీడియోస్ ని ఎనబుల్ చేసుకోని బ్యాక్ అప్ బటన్ పై క్లిక్ చేయాలి. అప్పటి వరకు వాట్సాప్ లో ఉన్న చాటింగ్, ఫొటోస్, వీడియోస్ మొత్తం డేటా గూగుల్ డ్రైవ్ లో సేవ్ అవుతుంది. దీని కోసం మీ మెయిల్ ఐడీని బ్యాక్ అప్ కు యాడ్ చేయాలి. మీరు మీ వాట్సాప్ యాప్ అన్ ఇన్ట్సాల్ చేసినా లేదా మీ ఫొన్ పోయినా, మళ్లీ కొత్తగా ఇన్ట్సాల్ చేసే వాట్సాప్ లో మీ పాత డేటాను పొందవచ్చు.