కరోనా తర్వాత ఆటల పరిస్థితి ఎలా ఉండబోతుంది?

కరోనా తర్వాత ఆటల పరిస్థితి ఎలా ఉండబోతుంది?

కరోనా మహమ్మారి తగ్గా క ఆటల పరిస్థితి ఎలా ఉంటుంది? మునుపటి లెక్క ఫ్యాన్స్ స్టేడియాలకు వస్తా రా? సోషల్ డిస్టెన్స్‌‌  పాటించడం కష్టమైన కాంటాక్ట్​ స్పోర్స్ట్ (ఫుట్‌ బాల్‌‌, రెజ్లిం గ్, కబడ్డీ లాం టివి) పరిస్థితి ఏమిటి? కరోనా దెబ్బకు వణికిపోతున్నప్రపంచంలో అసలు మనుపటి మాదిరిగా ఆటలు జరగడం, వాటిని చూడడం సాధ్యమవుతుం దా? ప్రస్తుతం క్రీడా ప్రపంచంముం దున్న ప్రశ్నలివి. వీటికి ఇండియాకు చెం దిన స్టార్‌‌‌‌ ప్లేయర్లు, మాజీ ఆటగాళ్లు ఇచ్చిన సమాధానాలు వారి మాటల్లోనే

సచిన్ టెండూల్కర్

మన లైఫ్​టైమ్‌‌లోనే ఈ ప్రపంచం మొత్తం అతి పెద్ద చాలెంజ్‌‌ ఎదుర్కుంటోంది అనడంలో సందేహం లేదు. క్రికెట్​మళ్లీ మొదలైన తర్వాత ఉమ్మిని  (బాల్​ను షైన్ చేసేందుకు) వాడే విషయంలో  ప్లేయర్లు కొంత కాలం పాటు జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నా.  ఈ విషయంపై వాళ్లు కొంత ఆందోళన చెందుతారు.  అలాగే, కొంతకాలం పాటు టీమ్‌‌ మేట్స్ మధ్య షేక్​హ్యాండ్స్, హై ఫైవ్స్, కౌగిలింతలు ఉండబోవు. ఆట తిరిగి మొదలైన తర్వాత ఈ మార్పులు ఉంటాయని నేను భావిస్తున్నా.  అలాగే, సోషల్ డిస్టెన్స్‌‌ కూడా మెయింటేన్ చేయాల్సి ఉంటుంది.

మేరీకోమ్

ఈ  గండం నుంచి గట్టెక్కి.. జీవితం మళ్లీ మనుపటి మాదిరిగా మారాలని అందరం కోరుకుంటున్నాం కానీ అది సాధ్యం కాబోదు.  అందువల్ల స్పోర్ట్స్  కూడా కచ్చితంగా మారుతాయి. బాక్సింగ్ కాంటాక్ట్ స్పోర్ట్ కాబట్టి.. వచ్చే మార్పును ఎలా ఎదుర్కోవాలనే విషయంలో  నేను కూడా ఆందోళన చెందుతున్నా. ఆట చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియాలకు వస్తారనడంలో ఎలాంటి డౌట్‌‌ లేదు. కానీ,  టోర్నీల టైమ్‌లో పరిశుభ్రత ప్రమాణాలు మరో స్థాయికి చేరుకుంటాయి.  కరోనాకు వ్యాక్సిన్‌‌ వచ్చిన తర్వాతే మునుపటి పరిస్థితులు చూడొచ్చు. కానీ, అప్పటిదాకా ఫారిన్‌‌ టూర్లు తక్కువ అవుతాయి. ట్రెయినింగ్, టోర్నమెంట్లు కూడా  గతంలో మాదిరిగా ఉండవు. అసలు ఇవి తిరిగి ఎలా ప్రారంభం అవుతాయో  కూడా తెలియదు.

 ద్రోణవల్లి హారిక

ఈ వైరస్ ప్రభావం నుంచి కోలుకోవడానికైనా లేదా ప్రయాణాలు మొదలవడానికైనా కొంత సమయం పడుతుంది. మన జీవితంలో దాదాపు ఒక ఏడాది మొత్తం కోల్పోతాం కాబట్టి చాలా మంది అథ్లెట్లపై దాని  ప్రభావం ఉంటుంది. అయితే, స్పోర్ట్స్ మునుపటి స్థితిలోకి రావాలంటే ఆరు నెలల నుంచి ఏడాది పట్టొచ్చు.

 బజ్‌‌రంగ్ పునియా

రెజ్లింగ్ ఒక కాంటాక్ట్ స్పోర్ట్. ఆట తిరిగి మొదలయ్యాక.. ఫిజికల్‌‌ కాంటాక్ట్‌‌ను నివారించడం అసాధ్యం.  కాబట్టి రెజ్లింగ్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని భావిస్తున్నా.  అయితే, ఈ ఆట మరింత రసవత్తరంగా మారే చాన్సుంది.ఇదివరకు మేం ఇంత లాంగ్ బ్రేక్స్ తీసుకోలేదు. కాబట్టి ఈ టైమ్‌‌లో మేమంతా మా బలాబలాలను విశ్లేషించుకుంటున్నాం.  కాబట్టి టోర్నీలు తిరిగి మొదలవగానే పోటీలో తీవ్రత ఎక్కువ అవుతుంది.

అభినవ్ బింద్రా

ఆట సమాజాన్ని ఏకం చేస్తుంది. ఫ్యూచర్‌‌‌‌లో స్పోర్ట్స్‌‌లో సేఫ్టీ  ప్రోటోకాల్స్ కూడా భాగం అవుతాయి. దాని వల్ల ఆటకు ఉన్న ఆకర్షణ ఏ మాత్రం తగ్గబోదు. ఫిట్​నెస్ పెంచుకునేందుకు స్పోర్ట్స్‌‌ బాట పట్టేవారి సంఖ్య పెరుగుతుంది. కరోనా అనంతర ప్రపంచం ఒకరకంగా ఇండియాకు చాలా మేలు చేస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే మునుపటి లెక్క ఫారిన్‌‌లో ట్రెయినింగ్, ప్రాక్టీస్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి మన దేశంలో తగిన స్పోర్ట్స్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను బిల్డ్‌‌ చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది.

సాయి ప్రణీత్‌‌

మా  ఆట (బ్యాడ్మింటన్‌)లో భాగంగా  మేం చాలా దేశాలు ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ, ఇంటర్నేషనల్ పోటీలు తిరిగి మొదలైన తర్వాత కూడా  చైనా, కొరియా, యూరోపియన్ కంట్రీస్‌‌కు వెళ్లడానికి ప్రతి ఒక్కరూ భయపడుతారు. ఇతర ప్రాంతాల్లో ఆడుతున్నప్పుడే కాకుండా, రెస్టారెంట్‌‌లో భోజనం చేస్తున్నప్పుడు కూడా వైరస్ భయం మనల్ని వెంటాడుతుంది.  మ్యాచ్ సందర్భంగా ప్లేయర్లు, సర్వీస్ జడ్జ్‌‌ షటిల్‌‌ను టచ్‌‌ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆట ఎలా సాధ్యం అవుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు. కాబట్టి వ్యాక్సిన్ వచ్చాకే బ్యాడ్మింటన్‌‌ను స్టార్ట్‌‌ చేస్తారని అనుకుంటు న్నా. అప్పుడు కూడా  మేం మాస్కులు ధరిం చి, రద్దీగా ఉండే ప్రదేశా లకు దూరంగా ఉండాలేమో.