IND vs ENG 2025: రేపే ఇండియా, ఇంగ్లాండ్ తొలి టెస్ట్.. లైవ్ స్ట్రీమింగ్, టైమింగ్స్, షెడ్యూల్ వివరాలు!

IND vs ENG 2025: రేపే ఇండియా, ఇంగ్లాండ్ తొలి టెస్ట్.. లైవ్ స్ట్రీమింగ్, టైమింగ్స్, షెడ్యూల్ వివరాలు!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ 2025-2027 లో భాగంగా టీమిండియా తొలి సవాలుకు సిద్ధమవుతుంది. ఇంగ్లాండ్ తో వారి గడ్డపై తొలి సిరీస్ రూపంలోనే భారత్ కు కఠిన సవాలు ఎదురు కానుంది. శుక్రవారం (జూన్ 20) నుంచి ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. లీడ్స్ వేదికగా హెడ్డింగ్లీలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్లు ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. ఈ సిరీస్ లో ఆతిధ్య ఇంగ్లాండ్ క్లియర్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. అదే సమయంలో భారత్ కుర్రాళ్లతో ఎలా ఆడుతుందో ఆసక్తికరంగా మారింది.  

ఈ సారి భారత్ పూర్తిగా యంగ్ స్టార్లతోనే బరిలోకి దిగుతుంది. ఇంగ్లాండ్ లాంటి పిచ్ లపై భారత యువ జట్టుకు అతి పెద్ద సవాలుగా మారనుంది. కనీసం ఇంగ్లాండ్ కు పోటీ కూడా ఇవ్వలేరని మాజీలు జోస్యం చెబుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుభమాన్ గిల్ భారత టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. మరోవైపు బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. ఇటీవలే ఆ జట్టులోని ఆటగాళ్లు సూపర్ ఫామ్ లో ఉండడంతో సిరీస్ గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. 

లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?

భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ను టీవీల్లో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. సోనీ స్పోర్ట్స్ 1, సోనీ స్పోర్ట్స్ 5, సోనీ స్పోర్ట్స్ 3 (హిందీ), సోనీ స్పోర్ట్స్ 4 (తమిళం, తెలుగు) మ్యాచ్ లను ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఆన్ లైన్ లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్ స్టార్ లో చూడొచ్చు. ఇటీవలే ఐపీఎల్ 2025 హక్కులను సొంతం చేసుకున్న జియోహాట్‌స్టార్.. టెస్ట్ సిరీస్ డిజిటల్ హక్కులను సైతం సొంతం చేసుకుంది. భారత కాలమాన ప్రకారం 5 టెస్ట్ మ్యాచ్ లన్నీ మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ప్రారంభమవుతాయి. 

Also Read : చివరి ఇన్నింగ్స్ ఆడిన లంక దిగ్గజం

టీవీ ప్రసారం: సోనీ స్పోర్ట్స్ 1, సోనీ స్పోర్ట్స్ 5, సోనీ స్పోర్ట్స్ 3 (హిందీ), సోనీ స్పోర్ట్స్ 4 (తమిళం, తెలుగు)

ఆన్‌లైన్ స్ట్రీమింగ్: జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్ ( https://www.jiohotstar.com/ ) లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది .

ఇంగ్లాండ్ టూర్‎కు వెళ్లే భారత టెస్ట్ జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ సింగ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్

ఇంగ్లాండ్ జట్టు:

బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్

ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ 2025 టెస్ట్ సిరీస్ షెడ్యూల్

1వ టెస్ట్: జూన్ 20-24 - హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్టు: జూలై 2-6 - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్టు: జూలై 10-14 - లార్డ్స్, లండన్
4వ టెస్టు: జూలై 23-27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 - కియా ఓవల్, లండన్