రాజయ్య, ఈటలకు ఒకన్యాయం.. మల్లారెడ్డికి మరో న్యాయమా?

V6 Velugu Posted on Aug 27, 2021

మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాపై తీవ్ర ఆరోపణలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కబ్జాలపై తాము నిలదీసే ప్రయత్నం చేస్తే.. ఉన్మాదిలా, పిచ్చికుక్కలా మల్లారెడ్డి మాట్లాడిండన్నారు. అవినీతి ఆరోపణలతో మాజీ మంత్రి రాజయ్య పై సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని..అదే విదంగా దేవర యాంజల్ భూములను కబ్జా చేశారని ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని అన్నారు. అలాంటిది మల్లారెడ్డి.. భూ కబ్జాలపై ఆధారాలను తాము బయట పెడుతున్నా కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆధారాలతో మల్లారెడ్డి పై ఆరోపణలు చేస్తున్నానన్న రేవంత్ రెడ్డి.. రాజయ్య, ఈటలకు ఒకన్యాయం.. మల్లారెడ్డికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. మల్లారెడ్డి భూ కబ్జాలపై సీఎం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

Tagged etela, between, Malla Reddy, justice differs, Rajaiah

Latest Videos

Subscribe Now

More News