IT Employees : ఐటీ ఉద్యోగులు ఆఫీసులో ఏం చేస్తున్నారు.. ఎంత సమయం వర్క్ చేస్తున్నారంటే..

IT Employees : ఐటీ ఉద్యోగులు ఆఫీసులో ఏం చేస్తున్నారు.. ఎంత సమయం వర్క్ చేస్తున్నారంటే..

ఉద్యోగులు ఆఫీసుల్లో రోజంతా ఖాళీ లేకుండా ఏమీ పని చేయడం లేదు. చాలా అవసరాల కోసం టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఓ సర్వే ప్రకారం ఆఫీసులో ఎంప్లాయ్స్ తమ సమయాన్ని ఇలా గడుపుతున్నారు.

* 47 శాతం మంది ఉద్యోగులు సోషల్ మీడియాను చెక్ చేసుకుంటున్నారు (44 నిమిషాలు). 
* 45 శాతం మంది న్యూస్ వెబ్సైట్స్ చూస్తున్నారు (దాదాపు గంట). 
* 38 శాతం మంది సహోద్యోగులతో ఆఫీసుకు సంబంధం లేని విషయాలపై చర్చిస్తున్నారు (నలభై నిమిషాలు).
• 31 శాతం మంది ఎక్కువ సమయం కాఫీ, టీలు తాగేందుకు టైమ్ స్పెండ్ చేస్తున్నారు (పదిహేడు నిమిషాలు). 
* 19 శాతం మంది ఆఫీసులోనే వేరే జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు (ఇరవై ఆరు నిమిషాలు). 
* 24 శాతం మంది ఫోన్ కాల్స్ చేసుకుంటున్నారు (పద్దెనిమిది నిమిషాలు).
* 24 శాతం మంది స్నాక్స్ తింటున్నారు. (ఎనిమిది నిమిషాలు).
* 28 శాతం మంది పొగతాగడానికి నాలుగైదు బ్రేకులు తీసుకుంటున్నారు. (23 నిమిషాలు).
* 27 శాతం మంది మెసేజులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు (పద్నాలుగు నిమిషాలు).