ఇండియాలో పెరుగుతున్న లక్షధికారులు: ఏడాదికి ఎంత సంపాదిస్తున్నారంటే.. : హురున్ వెల్త్ రిపోర్ట్

ఇండియాలో పెరుగుతున్న లక్షధికారులు: ఏడాదికి ఎంత సంపాదిస్తున్నారంటే.. : హురున్ వెల్త్ రిపోర్ట్

భారతదేశంలో ఆదాయ పన్ను కట్టేవాళ్ళ సంఖ్య ఈ మధ్య కాలంలో వేగంగా పెరిగింది. మెర్సిడెస్-బెంజ్ హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం, గత ఆరు ఏళ్లలో అంటే 2018 నుండి 2024 వరకు ఏడాదికి రూ.1 కోటి కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తు.. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేసేవారి సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది.

అధికారిక ఆదాయపు పన్ను డేటా ప్రకారం, 2017–18లో సుమారు 81వేల మంది పన్ను చెల్లింపుదారుల ఆదాయం రూ.1 కోటి కంటే ఎక్కువే ఉండగా, వీరి సంఖ్య 2023–24 AY నాటికి సుమారు 2.27 లక్షలకు పెరిగింది. ఇది దేశ ఆర్థికాభివృద్ధి, వ్యాపార రంగంలో ఎదుగుదల,  స్టాక్ మార్కెట్ల పెరుగుదలను సూచిస్తుంది. 

పన్ను చెల్లింపుదారులు పెరిగే కొద్దీ  అపార కుబేరుల/కోటీశ్వరుల సంఖ్య వేగంగా తగ్గిపోతుందని కూడా రిపోర్ట్ చూపిస్తుంది. దీని అర్థం లక్షల మంది ఇప్పుడు రూ.1 కోటిపైగా ఆదాయ వర్గంలోకి రాగా..., రూ. 5 కోట్లు, రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే ఉన్నవారి  వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. లక్షాధికారిగా మారడం సులభం అయినా.. అతి ధనవంతుల వర్గాన్ని చేరుకోవడం ఇప్పటికీ కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది.

 హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం, భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతు, సంపద సృష్టించే ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మారింది. మన దేశంలో ఇప్పుడు 8.71 లక్షల మంది లక్షాధికారులు (రూ. 8.5 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్న కుటుంబాలు) ఉన్నారు, 2021తో పోలిస్తే 90% పెరుగుదల.  లక్షాధికారులు, మల్టీ-మిలియనీర్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ బిలియనీర్ కావడానికి మార్గం చాలా కష్టంగా ఉంది.  

 ఈ రిపోర్ట్ ప్రకారం కొద్ది మంది లక్షాధికారులు మాత్రమే రూ. 100 కోట్లు లేదా రూ. 200 కోట్లకు చేరుకుంటున్నారు. విరిలో  కేవలం 0.07% మంది మాత్రమే రూ. 1,000 కోట్లకు చేరుకుంటుండగా... కేవలం 0.01% మంది మాత్రమే బిలియనీర్లు అవుతున్నారు. 

ఈ గణాంకాలు  రెండు ముఖ్యమైన విషయాలను తెలియజేస్తున్నాయి. ఒకటి ఎక్కువ మంది భారతీయులు కోట్లలో ఆదాయం సంపాదిస్తున్నారు. కానీ అపర కుబేరుల వర్గం ఇప్పటికీ చాలా చిన్నదిగా ఉంది. పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడం, ఎక్కువ మంది రూ. 1 కోటి ఆదాయ వర్గంలోకి రావడం, దేశం సంపద పెరుగుదలకు సూచన. అయితే, అదే సమయంలో సంపదలో అసమానతలు పెరుగుతున్నాయి. ఈ అసమానతలను తగ్గించి, అందరినీ కలుపుకుపోయే బలమైన ఆర్థిక విధానాలు అవసరమని నివేదిక సూచిస్తుంది.