దేశంలో రూ. 2 వేల నోట్లు ఎన్నున్నాయో తెలుసా..

దేశంలో  రూ. 2 వేల నోట్లు ఎన్నున్నాయో తెలుసా..

రూ. 2 వేల నోట్లపై  ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.  ఈ నోట్లను సర్క్యూలేషన్ నుంచి తొలిగిస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను 2023 మే 23 నుంచి మార్చుకునే అవకాశాన్ని కలిపించింది.  ప్రజలు ఒకసారి  గరిష్టంగా  పది రూ.2 వేల నోట్లను అంటే 20 వేల రూపాయలను డిపాజిట్ చేసుకోవచ్చునని పేర్కొంది.  అయితే ఇప్పుడు దేశంలో  2 వేల నోట్లు ఎన్నున్నాయన్నది పెద్ద చర్చగా మారింది.  రూ. 3.62 లక్షల కోట్ల 2 వేల రూపాయల నోట్లు అందుబాటులో ఉన్నట్లుగా ఆర్బీఐ వెల్లడించింది. 

 వేల నోటును ఎలా మార్చుకోవాలంటే..

  • ప్రజలు  తమ దగ్గర ఉన్న 2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. 
  • దీనికి తగిన డబ్బును 500, 100 నోట్ల కింద మీకు తిరిగి చెల్లిస్తారు.
  • బ్యాంకుల్లో రూ. 2 వేల నోట్లను మీ అకౌంట్ లో డిపాజిట్ చేసుకోవచ్చు. 
  • రోజుకు 20 వేల రూపాయలను మాత్రమే డిపాజిట్ చేయాలి. అంటే 10 నోట్లను మాత్రమే.
  •  పది 2 వేల నోట్లను మీ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసే అవకాశం 
  • ఒక వేళ మీకు బ్యాంక్ అకౌంట్ లేనట్లయితే.. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ మార్చుకోవచ్చు.