ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లు తెలంగాణలో ఎన్నంటే..?

ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లు తెలంగాణలో ఎన్నంటే..?

దేశ వ్యాప్తంగా తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో సహా 68 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాదితో పూర్తవనుంది. వీరిలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాదవ్య, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డాతో సహా 57 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం ఏప్రిల్‌లో పూర్తవుతుంది. 

ఇప్పటికే ఢిల్లీలో మూడు స్థానాలకు, సిక్కింలో ఒక స్థానానికి ఎన్నికలు జరిగాయి.  తెలంగాణలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు  రవిచంద్ర, బి. లింగయ్య యాదవ్ రిటైర్ కానున్నారు. వీరిస్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎన్నిక చేస్తుందనేది వేచి చూడాలి మరి.  

రాష్ట్రాల  వారీగా ఈ ఏడాది ఖాళీ అవనున్న సీట్లు ఎన్నంటే..

గుజరాత్ - 4
ఒడిశా - 3
తెలంగాణ -3 
కేరళ - 3
ఉత్తరప్రదేశ్ - 10 సీట్లు
మహారాష్ట్ర - 6
బీహార్ - 6
ఉత్తరాఖండ్ - 1
హిమాచల్ ప్రదేశ్ - 1
హర్యానా - 1
ఛత్తీస్‌గఢ్ - 1
మధ్యప్రదేశ్ - 5
పశ్చిమ బెంగాల్ - 5
కర్ణాటక - 4
ఆంధ్రప్రదేశ్ - 3
జార్ఖండ్ - 2
రాజస్థాన్ - 2