ప్రభుత్వోద్యోగుల్లో ఎవరెవరికి ఎంత జీతం కోత?

ప్రభుత్వోద్యోగుల్లో ఎవరెవరికి ఎంత జీతం కోత?

ఉద్యోగులు, పెన్షనర్లకు సగం జీతమే
ప్రజాప్రతినిధులకు 75 శాతం కోత
చిన్న ఉద్యోగులకు మాత్రం 10 శాతమే
ప్రభుత్వ రంగ సంస్థలకూ వర్తింపు
ఆర్థిక పరిస్థితిపై సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత విధించాలని రాష్ట్రప్రభుత్వం నిరయ్ణించింది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ మేరకు సీఎం కేసీఆర్ కీలక నిరయం తీసుకున్నారు. సోమవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్ధితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు సీఎంవో నుంచి ప్రెస్ నోట్ విడుదలైంది. ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ముందుచూపుతో, అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది’’ అని సీఎం కేసీఆర్ అందులో పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని
సమీక్షించాక వివిధ రకాల వేతనాల చెల్లింపులపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే ఏ నెల వేతనాల్లో కోత ఉంటుందనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. వచ్చే నెల ఒకటో తేదీన చెల్లించే జీతంలో కోత విధించే అవకాశం ఉంది. ఇక కోత పెట్టిన మేర తిరిగి ఎప్పుడు చెల్లిస్తారన్న
అంశాన్ని కూడా పేర్కొనలేదు.

ఎవరెవరికి ఎంత కోత?
ముఖ్యమంత్రి,రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75% కోత విధిస్తారు. వీరి సంఖ్య: 160

ఐఏఎస్,ఐపీఎస్,ఐఎఫ్ఎస్ లాంటి ఆలిండియా సర్వీసు అధికారుల వేతనాల్లో 60శాతం కోత పెడతారు. వీరి సంఖ్య సుమారు: 350

మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50శాతంకోతవిధిస్తారు. వీరి సంఖ్య: 2.80 లక్షలు

అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత పెడతారు. వీరి సంఖ్య: లక్షా 23 వేలు

నాల్గో తరగతి, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తారు. నాల్గోతరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10శాతం కోత విధిస్తారు. వీరి సంఖ్య: లక్షా 35 వేలు

అన్నిప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో కోత అమలవుతుంది.

జీతంలో కోత సరికాదు
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో 50 శాతం కోత విధించాలన్న సర్కారు నిర్ణయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక తప్పు పట్టింది. ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నాయకులు కె.లక్ష్మయ్య, జి.సదానందం గౌడ్, చావ రవి, సీహెచ్ సంపత్ కుమార్ స్వామి, జె.వెంకటేష్, యాదనాయక్, మైస శ్రీనివాస్, టి.లింగారెడ్డి, పి.కృష్ణమూర్తి, రాధాకృష్ణ తదితరులు దీనిపై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ ఇంత తీవ్రమైన నిర్ణయం ఏ దేశంగానీ, ఏ రాష్ట్రం గానీ ఇప్పటివరకు తీసుకోలేదన్నారు. అవసరమైతే ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో చర్చించి సమంజసమైన నిరయం తీసుకోవాల్సిందని స్పష్టం చేశారు. కేవలం 15 రోజుల లాక్ డౌన్ కే ఆర్థికర్థి పరిస్థితి ఇంత దారుణంగా తయారైందంటే నమ్మశక్యంగా లేదని పేర్కొన్నారు.

For More News..

22 లక్షల మంది చనిపోతారని అంచనాలున్నయ్

ఇక్కడున్న పక్క రాష్ట్రాల వారికీ బియ్యం, నగదు

మూడు రోజుల్లోనే 6 లక్షలు దాటిన కరోనా కాల్స్

కరోనా విరాళాలను వదలని సైబర్ దొంగలు

‘వర్క్ ఫ్రం హోం’ పై మైక్రోసాఫ్ట్ సూచనలు