భూకంపం వచ్చినపుడు చిన్నారులను నర్సులు ఎలా కాపాడారంటే..!

భూకంపం వచ్చినపుడు చిన్నారులను నర్సులు ఎలా కాపాడారంటే..!

టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం వల్ల నిమిషానికో వార్త వినాల్సి వస్తుంది. ఇప్పటికే భూకంపం దాటికి అక్కడ 24వేలకుపైగా మంది చనిపోగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఫిబ్రవరి 6న చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఓ వీడియో బయటికొచ్చింది. ఈ వీడియోలో ఇద్దరు నర్సులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోని శిశువులను కింద పడకుండా ఇంక్యుబేటర్‌లను గట్టిగా పట్టుకున్నారు. తమ ప్రాణాలకు అపాయం ఉందని తెలిసినా వారు ఆ చిన్నారులను కాపాడడానికే నిర్ణయించుకున్నారు. గజియాంటెప్‌లోని ఓ ఆస్పత్రి సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నర్సులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా టర్కీలో ఇప్పటివరకు 24,617 మంది మరణించారు. ఇది 1939 తర్వాత దేశంలో సంభవించిన అత్యంత భయంకరమైన భూకంపమని నిపుణులు చెబుతున్నారు.