నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా అంటే ?

నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా అంటే ?

ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ కు  ఓటిటి ఫ్లాట్ ఫ్లామ్స్ అడ్డాగా మారిపోతున్నాయి. కొత్త కొత్త సినిమాలు, టీవీ షోస్స్, ప్రొగ్రామ్స్ అన్ని కావాలనుకుంటే మన అరచేతిలోనే చూడొచ్చు. ఓటీటీ యాప్ లు చాలానే ఉన్నాయి. ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఉన్న చోట ఏదైనా మూవీ లేదా షో చూస్తుంటే అది బఫరింగ్ అవుతుంది.  అప్పుడు వీడియోస్  మధ్యమధ్యలో ఆగిపోతుంతాయి. దీంతో మీకు ఆ షో చూడాలనే ఉత్సాహం తగ్గిపోతుంది. అలాంటప్పుడే మీరు ఆ మూవీని డౌన్లోడ్ చేసుకొని ఆగిపోకుండా వీడియోస్ చూడవచ్చు. కంటీన్యూస్ గా వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేయోచ్చు. ఈ ఆప్షన్ నెట్ ఫ్లిక్స్ లో ఎలా పని చేస్తోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

నెట్ ఫ్లిక్స్ లోని మీరు డౌన్లోడ్ చేయాలనుకున్న మూవీ లేదా టీవీ షోపై క్లిక్ చేయండి.  డిటేల్స్ పేజీకి వెళ్లి అందులో బాణం గుర్తు కిందకి ఉండి డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే సినిమా లేదా షో డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడే మీరు వీడియో క్వాలిటీని కూడా సెట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేయడానికి ఇంటర్నెట్ ఆన్ లో ఉండాలి. నెట్ ఫ్లిక్స్ యాప్ లో డౌన్లోడ్ సెక్షన్ లో మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ ఉంటాయి. నెట్ ఫ్లిక్స్ మెంబర్స్ షిప్ క్యాన్సల్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకున్న కంటెంట్ ఉండదు. డౌన్లోడ్ చేసుకున్న వీడియోలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. మీ అకౌంట్ రెస్యూమ్ లో ఉంచితే.. మళ్లీ రిడౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటిని డిలెట్ చేస్తే మీ అకౌంట్ కు స్పెస్ యాడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకున్న మూవీ లేదా షో 2 నుంచి 30 రోజుల వరకు డివైస్ లో ఉంటుంది.