కాంగ్రెస్ అభయహస్తం అప్లికేషన్ ఇట్ల ఫిల్ చేయండి

  కాంగ్రెస్ అభయహస్తం అప్లికేషన్ ఇట్ల ఫిల్ చేయండి

రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది.  ఇవాళ్టి నుంచి జనవరి ఆరో తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది .  ఉదయం 8 గంటల నుంచి అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి.  ప్రజల నుంచి అధికారులు స్వీకరిస్తున్నారు.  ప్రతి వంద దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ ను ఏర్పాటు చేశారు అధికారులు.   మహిళలు, పురుషులు, దివ్యాంగులకు వేరువేరుగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు.  హైదరాబాద్ లో  150 డివిజన్లలో ప్రజాపాలన నిర్వహణ జరుగుతుంది.  

 దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని అన్ని  జిల్లాల కలెక్టర్లు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఈ దరఖాస్తుల్లో ఉన్న అనుమానులపై వివరణ ఇస్తున్నారు. దరఖాస్తులో ఉన్న అనుమానులపై నివృత్తి చేసేందుకు స్పెషల్ గా హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసినట్లుగా కలెక్టర్లు చెబుతున్నారు.  కుటుంబానికి ఒక దరఖాస్తు ఇస్తే సరిపోతుందని..  ఆరుగ్యారంటీలకు సంబంధించినవి ఇందులో సమకూర్చామని తెలుపుతున్నారు. 

దరఖాస్తులు కౌంటర్ దగ్గర ఫ్రీగా ఇస్తారని..ఎవరూ డబ్బులు పెట్టి కొనుక్కోవ్వదని చెప్పారు. ఒక వేళ బయటి నుంచి  ప్రింట్ తెచ్చుకుని ఇచ్చిన స్వీకరిస్తామని కలెక్టర్లు చెబుతున్నారు.  ఇంట్లో ఎంతమంది సభ్యులున్నా  ఎన్ని పట్టాదారు పాసు పుస్తకం నంబర్లు  ఉన్నా కామా పెట్టి ఇవ్వొ్చ్చునని చెబుతున్నారు.  అన్ని వెరిఫై చేసుకున్నాకే దరఖాస్తు తీసుకుంటామని అనంతరం వీటిని జనవరిలోపు ఆన్ లైన్ లో  డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. దాని ద్వారా ప్రభుత్వం స్కీమ్ లను ఇంప్లిమెంట్ చేస్తుందని తెలిపారు. 

అభయ హస్తంకు కావాల్సిన వివరాలు :

>>> ఆధార్ కార్డు నెంబర్, జిరాక్స్ కాపీ
>>> రేషన్ కార్డు నెంబర్, జిరాక్స్ కాపీ
>>> ఫోన్ నెంబర్
>>> గ్యాస్ కనెక్షన్ నెంబర్, కంపెనీ పేరు
>>>  మీ భూమి పాస్ పుస్తకం నెంబర్, సర్వే నెంబర్లు, విస్తీర్ణం వివరాలు
>>> కరెంట్ మీటర్ నెంబర్
>>> అమరవీరులు, ఉద్యమకారులు అయితే డెత్ సర్టిఫికెట్, FIR నెంబర్, జైలు, శిక్ష వివరాలు