తక్కువ ధరకే ట్విట్టర్‌ బ్లూ టిక్‌.. ఎలా పొందాలంటే..

తక్కువ ధరకే ట్విట్టర్‌ బ్లూ టిక్‌.. ఎలా పొందాలంటే..

ట్విట్టర్ ముందు చెప్పినట్టుగానే లెగసీ ట్విట్టర్ అకౌంట్లను తొలగించింది. ఇక నుంచి బ్లూ టిక్ సబ్ సబ్‌స్క్రిప్షన్ చెల్లించని వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు అన్నీ కూడా ఒకేలా కనిపిస్తాయి. దీంతో చిన్న క్రియేటర్ల నుంచి పెద్ద రాజకీయ నాయకులు, నటుల వరకు అందరూ ఒకే ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చారు. మీరు కూడా మీ ప్రొఫైల్ నుంచి బ్లూ టిక్ కోల్పోయినట్టయితే, దాన్ని తిరిగి పొందడానికి ఒక మార్గం ఉంది. 

ఇక్కడ మొదలయ్యే ప్రశ్న ఏమిటంటే బ్యాడ్జ్‌కి చెల్లింపు చాలా ఎక్కువ అని చాలా మంది నమ్ముతున్నారు. కానీ మీ ప్రొఫైల్ ను తక్కువ డబ్బుతోనే బ్లూ టిక్ సర్వీస్ బ్యాడ్జ్‌ని కలిగి ఉండేలా ఒక ఉపాయం ఉంది.

ట్విట్టర్ వెబ్‌సైట్ (యాప్ వెర్షన్ కాదు) ద్వారా యాక్సెస్ చేసే వారికి నెలకు రూ. 650 ధర ట్యాగ్‌తో కొత్త సబ్‌స్క్రిప్షన్‌ను ట్విట్టర్ ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్(iOS) యాప్ ద్వారా సబ్‌స్క్రయిబ్ చేసుకునే వినియోగదారులు నెలవారీ రుసుము రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది. ట్విట్టర్ గత సంవత్సరమే బ్లూ టిక్ కోసం డబ్బులు చెల్లించాలని, దాంతో పాటు కొన్ని కొత్త ఫీచర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అవి

  • బ్లూ చెక్ మార్క్
  • ట్వీట్లను ఎడిట్ చేసుకునే యాక్సెస్
  • లాంగ్ వీడియో పోస్ట్‌లు
  • బుక్‌మార్క్‌లు
  • కావల్సిన యాప్ చిహ్నాలు 
  • ప్రొఫైల్ ఫోటోలు
  • NFTని ఉపయోగించడానికి ఆప్షన్స్

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే తక్కువ డబ్బుతో ట్విట్టర్ బ్లూ టిక్‌ని మళ్లీ ఎలా పొందాలి? తక్కువ ధరకు బ్యాడ్జ్‌ని పొందడానికి మీరు అనుసరించగల చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వార్షిక సభ్యత్వం కోసం తగ్గింపులు, ఆఫర్‌లు: 

మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్న వార్షిక సబ్‌స్క్రిప్షన్‌పై తగ్గింపును అందిస్తోంది.
నెలకు సబ్‌స్క్రయిబ్ చేయడానికి ఏడాదికి మొత్తం రూ.7,800 ఖర్చు అవుతుంది. కానీ మీరు ఒక సంవత్సరం పాటు ఒకేసారి సబ్‌స్క్రిప్షన్‌ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే, మీరు సుమారు రూ. 1,000 ఆదా చేయవచ్చు. అంటే మీరు ట్విట్టర్ బ్లూ బ్యాడ్జ్‌కు రూ. 6,800కే సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయవచ్చు. 

ట్విట్టర్ బ్లూ బ్యాడ్జ్ వార్షిక సభ్యత్వం కోసం ఎలా సబ్‌స్క్రయిబ్  చేయాలంటే..

  • ట్విట్టర్ వెబ్‌సైట్‌ఓపెన్ చేయండి
  • వెబ్‌సైట్ ఎడమ కాలమ్‌లో ఉన్న 'ట్విట్టర్ బ్లూ'పై క్లిక్ చేయండి
  • ఒక పాప్-అప్ కనిపిస్తుంది. అక్కడ మీరు మీకు నచ్చిన ప్లాన్‌ని ఎంచుకుని, ఆపై చెల్లింపు చేయడానికి ఆప్షన్స్ కు ఎంచుకోండి
  • వార్షిక ప్లాన్‌ను ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్న వినియోగదారులు వెబ్‌సైట్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీరు వెబ్‌సైట్ నుంచి ట్విట్టర్ బ్లూ టిక్ కోసంసభ్యత్వాన్ని పొందినట్లయితే, మొబైల్ లో ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్(iOS) యాప్‌లతో పోలిస్తే తక్కువ డబ్బు చెల్లించవలసి ఉంటుంది.

మీరు Twitter వెబ్‌సైట్ నుంచి యాప్‌ను కొనుగోలు చేస్తే, మీ IDని యాప్‌లతో పాటు Twitter వెబ్ వెర్షన్ లాంటి అన్ని డివైజ్ లలోనూ ఉపయోగించవచ్చు-. అందుకే ట్విట్టర్ బ్లూ టిక్ కోసం వెబ్‌సైట్‌లోనే లాగిన్ అయి కొనుగోలు చేయండి. దీనివల్ల నెలకు రూ.250 లాభం వస్తుంది. ఎందుకంటే వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయడానికి రూ. 650 కాగా.. ఆండ్రాయిడ్ లేదా iOS యాప్ నుంచి కొనుగోలు చేయడానికి రూ. 900 ఖర్చవుతుంది.

యాప్ నుంచి ఎలా చేయాలంటే..

  • ఆండ్రాయిడ్ లేదా iOSలో యాప్‌ని ఓపెన్ చేయాలి.
  • ఇప్పుడు మెనూని యాక్సెస్ చేయడానికి కుడివైపుకి స్వైప్ చేయండి. మీకు 'ట్విట్టర్ బ్లూ' ఆప్షన్ కనిపిస్తుంది.
  •  దానిపై క్లిక్ చేసిన తర్వాత నెలవారీ ధర రూ. 900తో ప్రీమియం సర్వీసెస్ కు సభ్యత్వాన్ని పొందేందుకు ట్విట్టర్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
  • ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీరు బ్లూటిక్ హోల్డర్ అవుతారు. 

భారతదేశంలో ట్విట్టర్ ఈ విధానాన్ని ప్రారంభించినప్పటి నుంచి వినియోగదారులు TweetDeckని యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొనడం తప్పనిసరి. డబ్బు చెల్లించకుండా బ్లూటిక్ తీసుకున్న వినియోగదారులను సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కొనుగోలు చేసేలా ప్రోత్సహించేందుకు కంపెనీ పలు సమస్యలను సృష్టిస్తుందని నిపుణులు తెలిపారు.