వైరల్ అవుతున్న సమంత డ్యాన్స్ వీడియో

వైరల్ అవుతున్న సమంత డ్యాన్స్ వీడియో

హైదరాబాద్: ప్రముఖ తమిళ హీరో విజయ్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. స్నేహితుడు, విజిల్, సర్కార్ సినిమాలతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్.. ఇప్పుడు బీస్ట్ మూవీతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం నుంచి రీసెంట్ గా రిలీజైన ‘హలమతి హబీబో’ అనే పాట బాగా వైరల్ అవుతోంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం, గాత్రం అందించిన ఈ సాంగ్ మాస్ బీట్స్ తో హుషారుగా సాగుతుంది. ఈ పాటకు విజయ్, పూజా హెగ్డే వేసిన స్టెప్స్ కుర్రకారును హుషారెత్తిస్తున్నాయి. దీంతో ఈ సాంగ్ పై సెలబ్రిటీలు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కూడా హలమతి హబీబో పాటకు కాలు కదిపింది. తనదైన శైలిలో రిథమిక్ గా ఆమె స్టెప్స్ వేసింది. ఓ ఎయిర్ పోర్టులో ఫ్లయిట్ ఎక్కేముందు ఆమె ఈ డ్యాన్స్ వీడియో చేయడం విశేషం.   

మరిన్ని వార్తల కోసం: 

ప్రముఖ నటుడి సెకండ్ మ్యారేజ్

ఇక్కడి మట్టే మసాలా!

పవన్ మూవీ షూట్ కంప్లీట్