సండే ట్రై చేయండి : ఇంట్లోనే రెస్టారెంట్ స్టయిల్ మంచూరియా ఇలా తయారు చేసుకోవచ్చు..!

సండే ట్రై చేయండి : ఇంట్లోనే రెస్టారెంట్ స్టయిల్ మంచూరియా ఇలా తయారు చేసుకోవచ్చు..!

మన్చాహె మంచూరియా

ఏదైనా రెస్టారెంటికి వెళ్తే పిల్లల నుంచి పెద్దళ్లదాకా అందరూ ఇష్టంగా ఆర్డర్ చేసే స్టార్టర్ వెజ్ మంచూరియా. ఎంత తిన్నా 'నో' చెప్పకుండా తింటారు. కారం కారంగా ఎంత టేస్టీగా ఉంటుందే.. ఆ టేస్టీ వంటకాన్ని మీ వంటింట్లో కూడా టై చేయొచ్చు. హాయిగా ఇంట్లోనే రెస్టారెంట్ రుచిని ఆస్వాదించొచ్చు.

బేబీ కార్న్ మంచూరియా

కావాల్సినవి : దేవీ కార్న్- 300 గ్రా, కాన్ ఫ్లోర్- ఒక కప్పు జీలకర్ర- చిటికెడు అజనోమోటో-ఆర టీస్పూన్, ఉల్లిపాయ తరుగు) రెండు టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత అల్లం, వెల్లుల్లి పేస్ట్- ఒక. టేబుల్ స్పూన్: మైదా- అరకప్పు నీళ్లు-కొద్దిగా నూనె- కాచాల్సినంత ఉల్లి ఆకు- చిన్న కట్ట: పచ్చిమిర్చి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు- 4 అల్లం-చిన్న ముక్క క్యాప్సికమ్ ముక్కలు- ఒక టేబుల్ స్పూన్; ముల్లంగ్ ఒకటి క్యారెట్-1 ఎండు మిర్చి పేస్ట్- అరటేబుల్ స్పూన్, వెనిగర్, సోయాసాస్- ఒక టేబుల్ స్పూన్ సోయాసాస్- ఒక టీ స్పూన్ టొమాటో కెచప్- సిటీస్పూన్లు 

తయారీ: బేబీకార్న్ ముక్కలు తరిగి ఉడికించాలి ఇప్పుడు ఒక గిన్నెలో మైదా, కార్లోఫ్లోర్, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, వేసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో ఉడికించిన బేబీకార్న్ ముక్కల్ని ముంచి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. తర్వాత మరొక పాచ్లో నూనె పోసి అల్లం, వెల్లుల్లి, ఉల్లి పాయముక్కలు, పచ్చి మిర్చి, క్యాప్సికం ముక్కలు, క్యారెట్, ముల్లంగి వేసి వేగించాలి. ఇందులో ఎండు మిర్చి పేస్ట్, వెనిగర్, సోయాసాస్, చక్కెర, టొమాటో కిచన్ వేసి కొన్ని నీళ్లు పోసి సన్నని మంట మీద రాసేపు ఉడికించి సామ్రా చేయాలి, ఇందులో వేగించిన బేబీకార్న్ కూడా వేసి రెండు నిమిషాలు వేగించాలి. చివరిగా ఉల్లి ఆకు వేసి దించేయాలి. వేడిగా లాగించేస్తే సూపర్ గా ఉంటుంది.

క్యారెట్ మంచూరియా

కావాల్సినవి : క్యారెటీ తరుగు - ఒక కప్పు,మైదా- పావు కప్పు తరిగిన పచ్చి మిర్చి- 2 ఉప్పు-తగినంత కార్క్ ఫ్లోట్- పావు కప్పు మిరియాల పొడి - ఒకటీస్పూన్; సోయా సాస్- ఒక టేబుల్ స్పూన్ అల్లం తిరుగు - ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు - ఒక టేబుల్ వృన్: చిల్లీసాస్- ఒక టేబుల్ స్పూన్ నూనె- తగినంత కొత్తిమీర - కొద్దిగా

తయారీ : ఒక గిన్నెలో క్యారెట్ తరుగు, మైదాపిండి, కార్న్ ఫ్లోర్, వెల్లుల్లి అల్లం, మిరియాలు పొడి కొద్దిగా నీళ్లు పోసి పకోడి పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నూనెలో బాగా వేగించాలి. మరో పాన్లో నూనె పోసి సన్నగా తెరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, చిల్లీ సాస్ సోయాసాస్, ఉప్పు వేసి గైవీలా చేయాలి. ఇప్పుడు ఆ గ్రేవీలో వేగించిన క్యారెట్ ఉండల్ని కూడా వేసి కలిపితే వేడి వేడి క్యారెట్ మంచురియా రెడీ

మిర్చీ బజ్జీ మంచూరియా

కావాల్సినవి :  శెనగపప్పు- పావుకప్పు, పల్లీలు- పావు కప్పు చింతపండు- ఐదు గ్రాములు, చక్కెర - అర టీస్పూన్; జీలకర్ర - అరటీ స్పూన్, శెనగపిండి- ఒక కప్పు అల్లం, వెల్లుల్లి పేస్ట్- అర టీ స్యూన్: బేకింగ్ సోదా -కొద్దిగా; కారం- అర టీ స్పూన్; అల్లం- చిన్న ముక్క; వెల్లులి- ఐదు రెబ్బలు; ఎండుమిర్చి పేస్ట్- ఒకటి స్పూర్, సోయాసాస్- ఒక టీ స్పూన్; పచ్చిమిర్చి-15: గ్రీన్ చిల్లీ సాస్- అరటి స్పూన్ వెనిగర్- అర టేబుల్ స్పూన్;- మిరియాల పొడి - పావు టీ స్పూన్; కొత్త మీర-చిన్న కట్ట, ఉల్లిపాయముక్కలు- అర కప్పు, నిమ్మరసం- ఒక టీస్పూన్; ఉప్పు, నూనె- తగినంత 

తయారీ: మిక్సీ జార్లో చింతపండు, చక్కెర, జీలకర్ర, వేగించిన పల్లీలు,శెనగపప్పు, కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ చేయాలి. తర్వాత పచ్చి మిర్చిని నిలువుగా చీల్చి ఈ పేస్ట్ పెట్టాలి. మరోవె శెనగపిండి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, బేకింగ్ సోడా, కొద్దిగా నూనె నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు. కళాయిలో నూనె పోసి ప ఆ మిశ్రమంలో డేవ్ చేసి దోరగా వేగించి పది నిమిషాలు చల్లార్చి గుండ్రంగాకట్ చేసుకోవాలి. ఇప్పుడు మరో కదాయిలో నూనె పోసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సోయాసాస్, గ్రీన్ చిల్లీసాస్, ఎండుమిర్చి పేస్ట్, ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్, వెనిగర్, మిరియాల పొడి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమంలో బజ్జీ ముక్కలను కూడా వేసి వేగించాలి. చివరిగా నిమ్మరసం, వెల్లుల్లి తరుగు వేసి స్టవ్ ఆపేయాలి

అరటికాయ మంచురియా

కావల్సినవి : ఆకులు-2 అరటి కాయలు-1 నూనె- కావాల్సినంత పచ్చిమిర్చి- 6- మొక్కజొన్న పిండి- పది టేబుల్ స్పూన్లు మైదా- ఒకటిన్నర. టేబుల్ స్పూన్, నీళ్లు- కొద్దిగా సోయా బీన్ ముక్కలు-అరటీస్పూన్ చిల్లీసాస్ -రెండు టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు - రెండు టేబుల్ స్పూన్లు టోమాటో కెడన్- నాలుగు టీ స్పూన్లు, సోయాసాస్- ఒకటిన్నర టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్- ఒకటిన్నర టేబుల్ స్పూన్ చక్కెర-కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు- ఒక టేబుల్ స్పూన్ ఉప్పు- సరిపడా, కొత్తిమీర- కట్ట 


తయారీ : అరటికాయల్ని చెక్కు తీసి కాస్త మందంగా తరిగి ఉడికించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా, మొక్కజొన్న పిండి. తగినంత ఉప్పు, వేసి బజ్జీ పిండిలా కలపాలి. ఆ మిశ్రమంలో అరటి ముక్కలని డెప్ చేసి నూనెలో వేగించాలి. అరటిరాయరంగు మారిన తర్వాత దించేయాలి. స్టవ్ మీద మరో పాన్ పెట్టి నూనె వేసి పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, క్యాబేజీ తరుగు, అరటి ముక్కలు, టొమాటో ముక్కలు, బిల్లీ, సోయా పాస్లు, టొమాటో కెచప్, ఎక్కెడ, క్యాప్సికమ్, సోయాబీన్స్ వేసి బాగా కలపాలి. దింపేముందు కొత్తిమీద చల్లాలి. అరటికాయ మంచురియా రెడీ అయిపోతుంది.