
న్యూఢిల్లీ: పీపీఎఫ్ సబ్‌స్క్రయిబర్లు తరచుగా ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలలో ఒకటి.. పీపీఎఫ్ ఖాతా డీయాక్టివేట్ కావడం. అకౌంట్ హోల్డర్ ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు) కనీస మొత్తాన్ని ఉంచకపోతే ఖాతా ఆగిపోతుంది. ఫలితంగా ఆ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవడం సాధ్యం కాదు. అయినప్పటికీ ప్రిన్సిపల్ అమౌంట్‌కు వడ్డీని కలుపుతూనే ఉంటారు. పీపీఎఫ్ ఖాతాను 15 సంవత్సరాల మెచ్యూరిటీ కంటే ముందే మూసివేయడం సాధ్యం కాదు. మెచ్యూరిటీ తరువాత కూడా ఖాతాను కొనసాగించవచ్చు. పీపీఎఫ్ ఖాతా తిరిగి ఓపెన్ చేయడానికి ఒక లెటర్‌ను మన అకౌంట్ ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఇస్తే పని అవుతుంది. అయితే, డిఫాల్ట్ అయిన ప్రతి సంవత్సరానికి రూ .50 చొప్పున పెనాల్టీతోపాటు మరో రూ .500 చొప్పున (మినిమం బ్యాలెన్స్) ఖాతాదారుడు చెల్లించాలి.