
ఈ మధ్య కాలంలో వర్షం పడిందంటే చాలు రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ వరద నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు అంతా ఇంతా కాదు. అసలే గుంటల రోడ్లు.. మరో వైపు ఆ పని.. ఈ పని అంటూ తీసిన గోతుల్లో నీరు చేరి జరిగే ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావు. మే 21న బెంగుళూరులో వరద నీటిలో కారులో ప్రయాణిస్తున్న విజయవాడకు మహిళా టెక్ ఉద్యోగి (భానురేఖ) మరణించింది. ఈ నేపథ్యంలో వరదల వచ్చే ప్రాంతాల్లో వాహనదారులు కొన్ని జాగ్రత్తలను నిపుణులు సూచిస్తున్నారు. భారీ వరదలు వచ్చినప్పుడు కార్లో ప్రయాణించే వారు ఎలా క్షేమంగా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వరదల సమయంలో వీలైనంత వరకు మీ వాహనాన్ని బయటకు తీయవద్దని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. రోడ్లపై ఉండే గుంటలను అంచనా వేయలేము. డ్రైనేజీ మూతలు ఒక్కోసారి కొట్టుకుపోయి ఉంటాయి . అప్పుడు వాటిని గుర్తించలేము. అవి చాలా లోతును కలిగి ఉంటాయి. కొన్ని వాహనాలు వాటిలో పడి కొట్టుకుపోతాయి. క్విన్ నివేదిక ప్రకారం.. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్ కారులు లు సాధారణంగా 180 mm నుండి 200 mm పరిధిని కలిగి ఉంటాయి. అయితే SUV కార్లల్లో 300 mm నుండి 600 mm వరకు లోతు వరకు నీళ్లు నిండి ఉంటాయి.
2. వరదలు ఉన్న ప్రాంతాల్లో కారు నడిపేటప్పుడు రోడ్డుపై ఉన్న నీటిని చూసి..లోతును అంచనా వేయడం చాలా ముఖ్యం. హ్యాచ్‌బ్యాక్‌లు,సెడాన్ కార్ల వీల్ హబ్ మధ్యలో నీటి స్థాయి పెరిగితే డ్రైవింగ్ చేయకుండా ఉండటమే మంచిది.
3. వరదలు ఉన్న వీధిలో డ్రైవింగ్ చేస్తున్నట్లయితే .. నీటి స్థాయి పెరుగుతూ ఉంటే వాహనాన్ని ఆపేయాలి. కాని ఇంజిన్ ను కొంతసేపు రన్నింగ్ లోనే ఉంచాలి. ఆ తరువాత విండోలను తెరిచి ఉంచితే కారులోకి చేరిన వరద నీరు బయటకు వెళుతుంది. ఇంజిన్ రివ్‌లను వాడండి. (క్లచ్‌ను పాక్షికంగా నొక్కుతూ) నెమ్మదిగా వెళ్లండి.
4. వరదల సమయంలో పెట్రోల్ వాహనాల కంటే డీజిల్ వాహనాలు మెరుగ్గా పనిచేస్తాయి. ఎందుకంటే అవి స్పార్క్ ఇగ్నిషన్‌పై ఆధారపడవు. ఇది వరదనీటి వల్ల ఇంజిన్ ఆగిపోకుండా ఉంటుందని ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు.
5. గ్రిల్ వెనుక భాగంలో ఉండే బంపర్ ప్రాంతంలోకి నీరు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ అక్కడకు నీరు చేరితే హైడ్రాలిక్ ఏర్పడుతుంది. అప్పుడు ఇంజన్ బాగా దెబ్బతింటుంది. దీని రిపేర్ కు కూడా చాలా ఖర్చవుతుంది.
6. వరదల సమయంలో కారులోనికి నీరు వచ్చినప్పుడు..డోర్ లు తీసి నీరు బయటకు వెళ్లేలా చూసుకోవాలి. అంతే కాకుండా సగం వరకు నీరు చేరితే డోర్లు తీయడం చాలా కష్టమవుతుంది. టెయిల్ పైప్ మునిగిపోయినట్లయితే, కారు లోపల కార్బన్ మోనాక్సైడ్ పేరుకుపోవడం ప్రమాదకర పరిస్థితులకు దారితీయవచ్చు.
7. వరద నీటిలో కారులో ప్రయాణం చేసేటప్పుడు పరిస్థితి చేయి దాటిపోతే అక్కడే వాహనాన్ని వదలివేయడం మంచిది. నీటిమట్టం పెరుగుతున్నప్పుడు కారును ముందుకు పోనిచ్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలి. నీటిలో ప్రయాణించిన వాహనాన్ని కంటే నాన్ రన్నింగ్ వాహనాన్ని శుభ్రం చేయడం చాలా తేలికని మెకానిక్ లు వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.