Women Beauty : ఎండాకాలంలో జుట్టు సంరక్షణ ఎలా.. ఎలాంటి క్రీములు వాడాలి..?

Women Beauty : ఎండాకాలంలో జుట్టు సంరక్షణ ఎలా.. ఎలాంటి క్రీములు వాడాలి..?

వేసవిలో జుట్టు పొడిబారడం, ఎండుగడ్డిలా కనిపించడం మామూలే. ఆ సమస్యల్ని తగ్గించాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక చెమట, కాలుష్యం లాంటివి జుట్టుపై ప్రభావం చూపుతాయి. చుండ్రు, చివర్లు చిట్లడం, తలపొడిబారడం.. తదితర సమస్యలు ఎదురవుతాయి.

నుదుటి పైభాగంలో సన్ స్క్రీన్ రాయడం వల్ల జుట్టు జిడ్డుగా కనిపిస్తుంది. ఈ సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే సరిపోయే కండిషనర్ ని ఎంచుకోవాలి. ఒకవేళ స్విమ్మింగ్ కు వెళ్తుంటే ముందు కొంచెం కండిషనర్ రాసుకోవడం మంచిది. ఈత కొట్టడం అయ్యాక గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఈ కాలంలో హెయిర్ డ్రయ్యర్లను చాలా తక్కువగా ఉపయోగించాలి.

జుట్టు సహజంగా ఆరనివ్వడం వల్ల పొడిబారే సమస్య తగ్గుతుంది. జుట్టు చివర్ల చిట్లితే.. అంతవరకు కత్తిరించడం మేలు. లేదంటే జుట్టు ఇంకా ఎండుగడ్డిలా కనిపిస్తుంది. ఎండలో ఎక్కువ సేపు ఉండాల్సి వస్తే ఎస్పీఎఫ్(సన్ ప్రొడెక్షన్ ఫ్యాక్టర్) ఎక్కువగా ఉన్న హెయిర్ క్రీంలు ఎంచుకోవాలి. లేదా జుట్టు సంరక్షణకు ప్రత్యేక మాస్కులు వాడటం మంచిది.