చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దయినా పెన్షన్ ఎట్లా వస్తున్నది? : ప్రభుత్వ విప్ శ్రీనివాస్

చెన్నమనేని రమేశ్  పౌరసత్వం రద్దయినా పెన్షన్ ఎట్లా వస్తున్నది? : ప్రభుత్వ విప్ శ్రీనివాస్
  • ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: భారత పౌరసత్వం రద్దయినా చెన్నమనేని రమేశ్​కు పెన్షన్​ ఎలా ఇస్తారని అసెంబ్లీ విప్​ ఆది శ్రీనివాస్​ ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్​చాట్​ చేశారు. కేంద్ర హోం శాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 

జర్మనీలో ఉంటున్న చెన్నమనేనికి ఇప్పటికీ  అసెంబ్లీ నుంచి పెన్షన్​ ఆయన బ్యాంకు అకౌంట్​లో పడుతోందన్నారు. దీనిపై అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేసినా పెన్షన్​ ఆగలేదన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. కాగా.. చెన్నమనేని పౌరసత్వాన్ని  కేంద్ర హోం శాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. 

మోసపురితంగా భారత పౌరసత్వం పొందారంటూ హోం శాఖకు ఆది శ్రీనివాస్  ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి చెన్నమనేని భారత పౌరసత్వంపై శ్రీనివాస్​ గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు.  సిటిజన్ షిప్ యాక్ట్ 1995లోని సెక్షన్ 10 కింద పౌరసత్వాన్ని తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.