
సుమోటోగా కేసు స్వీకరించిన కమిషన్
బషీర్బాగ్, వెలుగు: రామంతాపూర్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో విద్యుత్ షాక్ కు గురైన ఐదుగురు మృతిచెంది, పలువురు తీవ్రంగా గాయపడిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది.
ఘటనకు గల కారణం, అధికారుల నిర్లక్ష్యం, తక్షణ పరిష్కార చర్యలు, బాధితుల కుటుంబాలకు పరిహారం, భద్రతా చర్యలపై సెప్టెంబర్ 22 లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీకి.. కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశాలు జారీ చేశారు.