హృతిక్, సబాల పెళ్లిపై రూమర్స్

హృతిక్, సబాల పెళ్లిపై రూమర్స్

బాలీవుడ్ హీరో హృతిక్​ రోషన్​ రెండో పెళ్లి రూమర్​ సోషల్​ మీడియాలో హల్ చల్​ చేస్తోంది. తన గార్ల్​ ఫ్రెండ్​ సబా ఆజాద్​ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. వీరి లవ్​ టాపిక్​ సోషల్​మీడియాలో వైరల్ ​అవుతోంది. దీనిపై హృతిక్​ ఫాదర్​ రాకేష్​ రోషన్​ స్పందించారు. ఇప్పటి వరకు దీని గురించి వినలేదని చెబుతున్నారు. 

హృతిక్​కు సన్నిహితుడైన ఒకరు కూడా ఈ విషయంపై మాట్లాడారు. ‘స్నేహం ఉందో లేదో తెలియదు గానీ మ్యారేజ్​అనే పదం స్టార్ట్​ చేశారు.​ఒకరినొకరు తెలుసుకుంటున్నారు. అలాగే ఉండనివ్వండి’ అని చెప్పారు. ఇదిలా ఉంటే ఇటీవల హృతిక్, సబా ఓ ఎయిర్​పోర్టులో ముద్దు పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది..​ అంతేకాదు హృతిక్​ ఫ్యామిలీ జరుపుకున్న వేడుకల్లో తరుచుగా సబా ఆజాద్​ కనిపిస్తుంటుంది. దీంతో ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కతున్నారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.