సాధారణంగా వినాయక చవితి పండుగ అంటే అందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో 9రోజులపాటు పూజలు నిర్వహిస్తారు. వేడుక సందర్భంగా మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. పూజల్లో బొజ్జ గణపయ్యకు ఉండ్రాళ్లు, నానుబియ్యం, పప్పు, కూరగాయలు వండి నైవేద్యం పెడతారు. భక్తులు కూడా ఆ వంటలే తింటారు. కాని కర్నాటకలో ఓ గ్రామంలో.. ఓ వర్గం వారు వినాయకుడికి మటన్, చికెన్ నైవేద్యంగా పెడతారు. దాదాపు అంతటా ఈ సంప్రదాయమే కొనసాగుతూ వస్తోంది.
కానీ, కర్ణాటకలోని ఒక ఊరిలో మాత్రం వింత ఆచారం అమలులో ఉంది. హుబ్బల్లి గ్రామంలో సావ్జీ వర్గానికి చెందిన వారు వినాయక చవితి తర్వాత మూడో రోజు నుంచి ఐదో రోజు వరకు గణపతికి మాంసాహారం, మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక రోజు చికెన్, మరో రోజు మటన్, తర్వాత చేపలు ఇలా రోజుకో రకం మాంసాహారం పెడుతారు.వీటితో పాటు మటన్ కీమా, మటన్ చాప్స్, మటన్ టిక్కా, మటన్ మసాలా, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై మరియు బిర్యానీ కూడా గణేశుడికి నైవేద్యంగా పెడతారు.
ఏకదంతుని విగ్రహం ముందు చికెన్, విస్కీలు పెట్టి పూజిస్తారు. మద్యాన్ని విగ్రహంపై చల్లుతారు. ఇదేమంటే..అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ ఛైర్మన్ మరియు సావ్జీ సంఘం నాయకుడు తెలిపిన వివరాల ప్రకారం తరతరాలుగా తామీ ఆచారాన్ని కొనసాగిస్తున్నట్లు ఆ వర్గం వారు తెలిపారు. వినాయకుడి తొండలో చేపలు పెట్టే ఆచారం కూడా ఉంది. శ్రావణ మాసంలో నెల రోజుల పాటు నాన్ వెజ్ తినని.. సావ్జీ వర్గం శ్రావణ మాసం ముగియగానే నాన్ వెజ్ తినడం మొదలు పెడతారు. కానీ గణేశుడి పండుగ కారణంగా గణేశుని ప్రతిష్టించిన మరుసటి రోజే నాన్ వెజ్ తినడం ప్రారంభిస్తారు.
ALSO READ | గణపతి .. గణాలకు అధిపతి మాత్రమే కాదు... ఘనమైన దైవం కూడా. ..
సావ్జీ కమ్యూనిటీ ప్రకారం, వారు గణేశుడిని తమ కుమారుడిగా చూస్తారు, కాబట్టి వారు నాన్ వెజ్ తిన్నప్పుడు, దానిని కూడా వినాయకుడికి సమర్పిస్తారు. వందల ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. ఇలివార వారంలో, సావ్జీ సంఘం వారి బంధువులను ఆహ్వానిస్తుంది. గణేశుడికి మాంసాహార నైవేద్యాలు సమర్పించిన తర్వాత, వారు కుటుంబంతో కలిసి సామూహిక విందును చేసి ఆనందంగా గడుపుకుంటారు. కాగా ఈ విధంగా పూజ చేస్తేనే స్వామివారు తమను చల్లగా చూస్తాడని వారి నమ్మకం. అయితే ఇదంతా ఇళ్లలోనే చేస్తారు. ఆ గ్రామంలో ఆ ఒక్క వర్గానికి చెందిన దాదాపు వంద కుటుంబాల వారే ఈ రకమైన పూజలు చేయడం గమనార్హం.