ఫిబ్రవరి 14న ఆవులను కౌగిలించుకోండి

ఫిబ్రవరి 14న ఆవులను కౌగిలించుకోండి

ఫిబ్రవరి 14  ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. ప్రపంచంలోని ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఈ రోజును ఓ స్పెషల్ డేగా  ఫీల్ అవుతుంటారు. అయితే  యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఓ అడుగు ముందుకేసి ఆవు ప్రేమికులందరూ ఫిబ్రవరి 14ను కౌ హగ్ డేగా జరుపుకోవాలని ప్రకటించింది.  ఆవులని  కౌగిలించుకోవడంతో మానసిక స్థైర్యంతో పాటు వ్యక్తిగత, సామాజిక ఆనందాన్ని పెంచుతుందని అన్నారు.  భారత దేశ సాంప్రదాయాలు  అంతరించిపోవడానికి విదేశీ సంస్కృతి కారణం  అవుతోందని..  దేశ సంస్కృతిని కాపాడేందుకు ఫిబ్రవరి 14న కౌ హగ్ డే గా జరుపుకోవాలని కోరింది.   భారత దేశ సంస్కృతికి, ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచి గోమాతను పూజించుకోవాలని సూచించింది. పోషకాహార స్వభావం ఉన్నందున దీనిని "కామధేను, గౌమాత గా అని పిలుస్తారని పేర్కొంది.