మమతా బెనర్జీ ఈడీ ఆఫీసర్ ఫోన్ దొంగలించారు: సుప్రీంకోర్టులో ఈడీ సంచలన ఆరోపణలు

మమతా బెనర్జీ ఈడీ ఆఫీసర్ ఫోన్ దొంగలించారు: సుప్రీంకోర్టులో ఈడీ సంచలన ఆరోపణలు

కోల్‎కతా: పొలిటికల్ కన్సల్టెన్సీ ఐప్యాక్‎ కార్యాలయంలో సోదాల సమయంలో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆఫీసర్ ఫోన్‎ను సీఎం మమతా బెనర్జీ దొంగలించారని ఈడీ ఆరోపించింది. ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయం, ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంపై జరిగిన దాడుల్లో సీఎం మమతా బెనర్జీ జోక్యం చేసుకున్నారని ఆరోపిస్తూ ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‎పై గురువారం (జనవరి 15) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈడీ తరుపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

ఐప్యాక్ కార్యాలయం, ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీకా జైన్ నివాసంలో ఈడీ తనిఖీల సమయంలో పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం మమతా బెనర్జీ దౌర్జన్యంగా చొరబడ్డారని ఆరోపించారు. బొగ్గు అక్రమ రవాణా కుంభకోణానికి సంబంధించిన కీలకమైన ఆధారాలను ఆమె తీసుకుపోయారని ఆరోపించారు. అలాగే.. ఈడీ అధికారి ఫోన్‌ను కూడా మమతా బెనర్జీ దొంగలించారని సంచలన ఆరోపణలు చేశారు.

ALSO READ : భారతీయులకు జాబ్స్ ఇవ్వొద్దంటూ అమెరికాలో రచ్చ..

కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులను అడ్డుకోవడం, వారిపై దాడులు చేయడం బెంగాల్‎లో ఇదే కొత్త కాదని.. గతంలో కూడా సీబీఐ అధికారులపై రాళ్లు రువ్విన ఘటనలు ఉన్నాయని ఆయన కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి సంఘటనలు అధికారులు తమ విధులను నిర్వర్తించకుండా నిరోధిస్తాయని, కేంద్ర బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఈడీ దాడుల సమయంలో అక్రమంగా ఘటన స్థలంలోకి చొరబడ్డ పోలీస్ ఉన్నతాధికారులను  సస్పెండ్ చేయాలని.. వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆయన అభ్యర్థించారు. 

ALSO READ : లండన్ లో హైడ్రామా

కోల్ కతా హైకోర్టులో జనవరి 9న ఈడీ పిటిషన్‎పై విచారణ సందర్భంగానూ కోర్టులో టీఎంసీ గందరగోళం సృష్టించిందని.. దీంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తిందని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు విచారణ సమయంలో సీఎం మమతా బెనర్జీ ఒక ప్రణాళిక ప్రకారం టీఎంసీ కార్యకర్తలను పెద్ద ఎత్తున బస్సుల్లో కోర్టు దగ్గరికి తరలించారని ఆరోపించారు.

ALSO READ : రోజుకు రూ.200 సేవ్ చేస్తే చేతికి రూ.10 లక్షలు..


 అలాగే.. తమ న్యాయవాది వాదనలు వినిపించకుండా కోర్టులో అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై స్పందించిన సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టులో జరిగిన గందరగోళం కలత చెందే ఘటన అని పేర్కొంది. హైకోర్టును జంతర్ మంతర్‎గా మార్చారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సీరియస్ మ్యాటర్ అని.. ఈ విషయంలో నోటీసు జారీ చేయాలని భావిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

మమతా బెనర్జీ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈడీ బెంగాల్‌కు వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణం కేసులో చివరి పరిణామం 2024, ఫిబ్రవరి 2024 జరిగింది. రెండేళ్ల తర్వాత ఇదే కేసులో ఈడీ సోదాలు చేయడమేంటన్నారు. 

ఐప్యాక్ సంస్థ టీఎంసీ పొలిటికల్ కన్సల్టెన్సీగా ఉందని.. ఈ మేరకు ఐప్యాక్, టీఎంసీ మధ్య ఒప్పందం ఉందని కోర్టుకు తెలిపారు. టీఎంసీ ఎన్నికల వ్యుహాలకు సంబంధించిన డేటా మొత్తం ఐప్యాక్ కార్యాలయంలో ఉందని.. అందుకే ఈడీ దాడుల సమయంలో టీఎంసీ పార్టీ అధినేతగా మమతా బెనర్జీ అక్కడికి వెళ్లారని పేర్కొన్నారు.